Durdarshan : దూరదర్శన్.. ఈ కాలం వారికి పెద్దగా తెలియదు గానీ.. టెలివిజన్ రంగం ఈ స్థాయిలో అభివృద్ధి చెందినప్పుడు.. ప్రైవేట్ ఛానల్స్ ఈ రేంజ్ లో లేనప్పుడు.. వినోదం అంటే దూరదర్శన్ మాత్రమే. దూరదర్శన్ లో వార్త వచ్చింది అంటే అది నూటికి నూరుపాళ్లు నిజం అయి ఉండేది. ఆఫ్ కోర్స్ దూరదర్శన్ ప్రభుత్వపరమైన వార్తలను మాత్రమే ప్రసారం చేసినప్పటికీ.. అందులో అభివృద్ధి పథకాలు.. నాయకులు చేసిన ప్రకటనలకు మాత్రమే స్థానం ఉండేది.
Also Read : అప్పట్లో క్రికెట్ చూస్తుంటే అదే సమస్య
ఇప్పుడు డబ్బా కొడుతున్న న్యూస్ చానల్స్ మాదిరిగా దూరదర్శన్ వ్యవహారం ఉండకపోయేది. సరళమైన తెలుగు.. స్పష్టమైన వార్తలు.. జానపద గేయాలు.. ప్రతి ఆదివారం ఒక సినిమా.. ఇలా ఉండేది దూరదర్శన్ వ్యవహారం. అందువల్లే నాటి యాంటినా రోజుల్లో దూరదర్శన్ ప్రధాన వినోద సాధనంగా ఉండేది. దూరదర్శన్ ప్రసారాలు ఏదైనా అవాంతరం వల్ల ఆగిపోతే.. ఆకాశవాణి ఆ లోటును భర్తీ చేసేది. అయితే కాలక్రమంలో టెలివిజన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడం.. ప్రవేట్ ఛానల్స్ దూసుకు రావడం.. ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడంతో దూరదర్శన్ ఆదరణ లేక నిస్సారంగా ఉండిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థ కావడం.. పరిమితులు అనేకం ఉండడంతో దూరదర్శన్ ఎదగలేకపోయింది. అయితే ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న దూరదర్శన్ ను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదుకునేందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థను లాభాల బాట పట్టించిన కేంద్రం.. త్వరలో దూరదర్శన్ ను కూడా సరికొత్తగా మార్చే పనిలో పడింది.
ప్రసార భారతి కీలక నిర్ణయం
దూరదర్శన్ ప్రసార భారతీయ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దూరదర్శన్ ఛానల్ ను పునరుద్ధరించడానికి ప్రసార భారతి కీలక నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలకంగా సృష్టి సారించడంతో ప్రసార భారతి నిర్వాహకులు జర్నలిస్టు & న్యూస్ యాంకర్ సుధీర్ చౌదురి తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో సుధీర్ దూరదర్శన్ లో పనిచేయబోతున్నారు. విశ్వసనీయమైన, ప్రభావంతమైన, పారదర్శకమైన, స్ఫూర్తివంతమైన వార్తలను ప్రసారం చేయడానికి దూరదర్శన్ కృషి చేస్తుందని తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రసార భారతి దాదాపు 14 కోట్లను ఖర్చు చేయబోతోంది. ఈ ఒప్పందంలో భాగంగా దూరదర్శన్ ఒక పవర్ హౌస్ గా మారే అవకాశం కనిపిస్తోంది. దూరదర్శన్ కు విస్తృతమైన వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అది నిస్తేజంగా మారింది. సరిగ్గా ఇన్ని సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో దూరదర్శన్ కు మంచి రోజులు రాబోతున్నాయి. అయితే కేవలం వార్తలపరంగానే దూరదర్శన్ ను మార్చుతారా.. ఎంటర్టైన్మెంట్ రంగంలోకి కూడా తీసుకొస్తారా? అనే ప్రశ్నలకు ప్రసార భారతి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక దూరదర్శన్ కు దేశవ్యాప్తంగా విస్తృతమైన స్టూడియోలు ఉన్నాయి. అపారమైన నెట్వర్క్ కూడా ఉంది. దీనిని ఉపయోగించుకుంటే దూరదర్శన్ అద్భుతమైన పవర్ హౌస్ లాగా మారే అవకాశం ఉంది.
Also Read : ఇంగ్లండ్ తో టీ20: భువనేశ్వర్ ది ఏం స్వింగ్ రా బాబూ! బట్లర్ ఔట్ వండర్.. వైరల్ వీడియో