https://oktelugu.com/

Phonepe: ఫోన్ పే వాడే వారికి శుభవార్త.. రెండు కొత్త సర్వీసులు అందుబాటులోకి?

Phonepe: ఇటీవల కాలంలో అందరు నగదుకు బదులు ఫోన్ పేలతోనే వాడుతున్నారు. యూపీఐ పేమెంట్స్ యాప్ తో ఫోన్ పేను ఉపయోగిస్తున్నారు. ఇక మీదట ఫోన్ పే వాడే వారికి శుభవార్త చెబుతోంది. అంతర్జాతీయంగా పేమెంట్లు పెరుగుతున్న దృష్ట్యా కంపెనీ తాజాగా యూపీఐ ఇంటర్నేషనల్ పేమెంట్లు సర్వీసులు అందుబాటులోకి తీసకొచ్చేందుకు డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్ పే ప్రకటించింది. ఫోన్ పే వాడే వారు ఇక మీదట విదేశీ సంస్థలకు సైతం లావాదేవీలు కొనసాగించేందుకు నిర్ణయించింది. యూనిఫైడ్ […]

Written By: , Updated On : February 11, 2023 / 05:45 PM IST
Follow us on

Phonepe

Phonepe

Phonepe: ఇటీవల కాలంలో అందరు నగదుకు బదులు ఫోన్ పేలతోనే వాడుతున్నారు. యూపీఐ పేమెంట్స్ యాప్ తో ఫోన్ పేను ఉపయోగిస్తున్నారు. ఇక మీదట ఫోన్ పే వాడే వారికి శుభవార్త చెబుతోంది. అంతర్జాతీయంగా పేమెంట్లు పెరుగుతున్న దృష్ట్యా కంపెనీ తాజాగా యూపీఐ ఇంటర్నేషనల్ పేమెంట్లు సర్వీసులు అందుబాటులోకి తీసకొచ్చేందుకు డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్ పే ప్రకటించింది. ఫోన్ పే వాడే వారు ఇక మీదట విదేశీ సంస్థలకు సైతం లావాదేవీలు కొనసాగించేందుకు నిర్ణయించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ఇన్ ఫ్రాక్టర్ ప్లాట్ ఫామ్ ద్వారా సేవలు అందించనుంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్ వంటి దేశాల్లో కూడా ఈ ఫోన్ పే సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని వల్ల ఫోన్ పే వాడే వారు సులభంగా అంతర్జాతీయంగా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఫోన్ పే ప్రకారం బ్యాంకు ఖాతాల నుంచే చెల్లింపులు చేస్తున్నాం. ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నాం. యూపీఐ ఇంటర్నేషనల్ స్థాయిలో ఇతర దేశాలు కూడా యూపీఐ సేవల తీరును తెలుసుకుంటాయి. ఇది గేమ్ చేంజర్. దీని వల్ల ఇండియన్స్ విదేశాలకు వెళ్లినప్పుడు చాలా సులభంగా పేమెంట్లు చేయడానికి అవకాశముంటుంది.

ఫోన్ పేకు 43.5 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. ఇంకా 3.5 కోట్ల మంది ఆన్ లైన్ కస్టమర్లను కలిగి ఉంది. మార్కెట్లో అత్యధిక వాటాను ఫోన్ పే కలిగి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సర్వీసుల కారణంగా ఫోన్ పే మార్కెట్ మరింత విస్తరించనుంది. యూపీఐ పేమెంట్లు అంతర్జాతీయంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ) కూడా యూపీఐ సర్వీసులు వాడుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ నెంబర్స్ పై బ్యాంక్ అకౌంట్లను లింక్ చేసుకుని యూపీఐ సేలు పొందవచ్చు.

Phonepe

Phonepe

ఆస్ట్రేలియా, సింగపూర్, యూఏఈ, యూకే, ఖతర్ వంటి దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలు అందుబాటులో ఉంటుంది. ఫ్రాన్స్ కు చెందిన మల్టీ నేషనల్ పేమెంట్స్ కంపెనీ వరల్డ్ లైన్ తో భాగస్వామ్యం చేసుకుంది. ఫోన్ పే ప్లాట్ ఫామ్ పై యూపీఐ సేవలు అందజేస్తోంది. దీంతో తక్కువ విలువ ట్రాన్జాక్షన్లు చేసుకోవచ్చు. ఇప్పుడు యూపీఐ సేవలు విస్తృతం చేసుకోవడంతో వ్యాపార లావాదేవీలు మరింత ఊపందుకోనున్నాయి.

 

Tags