రెండో భార్య దగ్గరికి వెళ్ళాలి.. ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి

“సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవని”  తెలుగులో ఒక సామెత ఉందిలే.. లాక్ డౌన్ నేపథ్యంలో కూడా కొంతమంది కష్టాలు ఇలానే ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అనేక దేశాల ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ఒకవేళ ఎవరైనా బయటకు రావాలంటే తప్పకుండా ప్రభుత్వం నుంచి పర్మిట్ తీసుకోవాలని సూచించింది. దీనిలో భాగంగా ప్రభుత్వాలు ఇందుకోసం ఓ హెల్ప్ లైన్ సెంటర్ ను కూడా ఏర్పాటు […]

Written By: Neelambaram, Updated On : April 9, 2020 12:54 pm
Follow us on

“సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవని”  తెలుగులో ఒక సామెత ఉందిలే.. లాక్ డౌన్ నేపథ్యంలో కూడా కొంతమంది కష్టాలు ఇలానే ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అనేక దేశాల ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ఒకవేళ ఎవరైనా బయటకు రావాలంటే తప్పకుండా ప్రభుత్వం నుంచి పర్మిట్ తీసుకోవాలని సూచించింది. దీనిలో భాగంగా ప్రభుత్వాలు ఇందుకోసం ఓ హెల్ప్ లైన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసాయి. ఈ హెల్ప్ లైన్ సెంటర్ కి అనేకమంది ఫోన్ చేసి వారి కష్టాలను పంచుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆసుపత్రికి వెళ్ళడానికి, నిత్యావసర వస్తువులకోసం వెళ్ళాలనుకునే వాళ్ళుఇలా వివిధ సమస్యలతో ఫోన్ చేసి పర్మిట్ తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే దుబాయికి చెందిన ఓ వ్యక్తి ఈ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి అడిగిన ప్రశ్నకు పోలీసు అధికారి షాకయ్యాడు. సార్.. నాకు ఇద్దరు భార్యలు. ఆ ఇంటికి, ఈ ఇంటికి తిరగాల్సి ఉంటుంది. మరి నేను పర్మిట్ తీసుకోవాలా? అని సదరు వ్యక్తి అడిగాడు. ఈ ప్రశ్నకు పోలీసు అధికారి నవ్వుతూ.. పర్మిట్ తీసుకోవడమే మంచిదని చెప్పాడు. పర్మిట్ కేవలం ఒకసారి మాత్రమే పనిచేస్తుందని.. ఈ లెక్కన రోజు పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాధానం ఇచ్చాడు.