కరోనా ప్రభావం ప్రపంచ మంతా పాకుతోంది. అభివృద్ధి చెందిన దేశాలే అల్లాడిపోతున్నాయి. అమెరికా , ఇటలీ , స్పెయిన్ , ఫ్రాన్స్ వంటి వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఈ గండం ఎలా గట్టెక్కాలా అని తెగ టెన్షన్ పడుతున్నాయి. ప్రపంచానికే పెద్దన్నను నేను అని చెప్పుకొనే అగ్రరాజ్యం అమెరికా కూడా చిగురుటాకులా వణికిపోతోంది. ఇప్పటివరకు 13000 కు పైగా మరణాలతో 4 లక్షలు దాటిన కరోనా కేసులతో ప్రకృతి మ్రోగించిన మరణ మృదంగం మోతకు తల్లడిల్లి పోతోంది. ఇక కరోనా దెబ్బకు న్యూయార్క్ రాష్ట్రము లో శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. స్మశానాల్లో పూడ్చడానికి స్థలం లేక అనాధ ప్రేతాల్లా మార్చురీలో మగ్గుతున్నాయి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు మన తెలుగు అమ్మాయి , ఒకనాటి నటి అయిన మాన్య .
ఒకప్పుడు టాలీవుడ్ లో మెరిసిన నటి మాన్య ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంటోంది. సీతారామరాజు , దేవా , సాంబయ్య , కాలేజ్ , బ్యాచ్ లర్స్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళం మలయాళం సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొత్తం 40 చిత్రాల్లో నటించింది. ఆ తరవాత పెళ్లి చేసుకొని యు ఎస్ వెళ్ళిపోయింది . ప్రస్తుతం అమెరికాలో ఫైనాన్స్ ప్రొఫెషనల్ గా , న్యూయార్క్ సిటీ లో కుటుంబంతో ఉంటున్న మాన్యా అక్కడి దారుణ పరిస్థితి పై వీడియోలో వివరణ ఇచ్చింది .
న్యూయార్క్ రాష్ట్రం లో ఊహకందని రీతిలో కరోనా భాదితులు పెరిగి పోతున్నారని మాన్యా ఆవేదన వ్యక్తం చేసింది. నిన్న ఒక్కరోజే 779 మంది న్యూయార్క్ రాష్ట్రం లో మరణించడం జరిగిందని తెలిపింది. దీంతో ఇప్పటివరకు న్యూయార్క్ రాష్ట్రంలో 6000 మరణాలు దాటాయని భాదగా చెప్పింది. కరోనా వల్ల మరణించిన వారిని బంధువులు కూడా చూడలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మా ఫ్రెండ్ నాన్న కరోనా వల్ల చనిపోతే చివరి చూపును కూడా చూడనీయలేదని.. దూరం నుంచి కూడా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికాలో కరోనాతో సర్వం బంద్ అయ్యాయని.. నిరుద్యోగులు రోడ్డున పడ్డారని మాన్య తెలిపింది. ఇండియాలో లాక్ డౌన్ తో మరణాలు బాగా కంట్రోల్ అయ్యాయని కొనియాడింది.
నటుడు గిరిబాబు నిర్మించిన సింహగర్జన వంటి సొంత చిత్రాలతో పాటు, రవి చిత్ర బ్యానర్లో నిర్మించబడ్డ లాయర్ విశ్వనాధ్ వంటి బడా చిత్రాలకు కెమెరా మాన్ గా పనిచేసిన మేటి ఛాయాగ్రాహకుడు పి. దేవరాజ్ (పసుపులేటి దేవరాజ్ ) కి దగ్గరి బంధువు ఈ హీరోయిన్ మాన్య.