కరోనాతో అమెరికాలో తుపాకులకు గిరాకీ!

కరోనా విజృభించిన అమెరికాలో ఇప్పుడు తుపాకులకు గిరాకీ ఏర్పాయింది. అసలుకే విచ్చలవిడిగా తుపాకులు కాలుస్తుండే అమెరికా సంస్కృతిలో ప్రస్తుత ఉపద్రవం ఆ దేశ ప్రజలలో అభద్రతా భావం పెంచుతున్నది. అరాజకం ప్రబలే అవకాశం ఉన్నట్లు భయపడుతున్నారు. ఇది కేవలం భయంతో జరగడం లేదని, ఆ దేశంలో నెలకొన్న సామాజిక రుగ్మతకు నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) లెక్కల ప్రకారం.. గత మార్చి నెలలో అమెరికన్లు ఏకంగా 20 లక్షల తుపాకులను కొనుగోలు […]

Written By: Neelambaram, Updated On : April 9, 2020 10:19 am
Follow us on


కరోనా విజృభించిన అమెరికాలో ఇప్పుడు తుపాకులకు గిరాకీ ఏర్పాయింది. అసలుకే విచ్చలవిడిగా తుపాకులు కాలుస్తుండే అమెరికా సంస్కృతిలో ప్రస్తుత ఉపద్రవం ఆ దేశ ప్రజలలో అభద్రతా భావం పెంచుతున్నది. అరాజకం ప్రబలే అవకాశం ఉన్నట్లు భయపడుతున్నారు. ఇది కేవలం భయంతో జరగడం లేదని, ఆ దేశంలో నెలకొన్న సామాజిక రుగ్మతకు నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు.

ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) లెక్కల ప్రకారం.. గత మార్చి నెలలో అమెరికన్లు ఏకంగా 20 లక్షల తుపాకులను కొనుగోలు చేశారు. 2013 జనవరిలో బరాక్‌ ఒబామా రెండోసారి అధ్యక్షుడయ్యాక, శాండీహుక్‌ మారణహోమం తర్వాత ఆ స్థాయిలో తుపాకుల కొనుగోళ్లు జరుగుడం ఇదే తొలిసారి.

కరోనా మరణాలు అధికమవుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో స్వీయ రక్షణ కోసం ప్రజలు తుపాకుల కోసం ఎగబడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా తుపాకుల దుకాణాల ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.

కరోనా వ్యాప్తి నిరోధించడంలో భాగంగా ప్రభుత్వం ఆంక్షల పేరిట నిరంకుశంగా వ్యవహరించే అవకాశమున్నందున చాలామంది తుపాకుల వైపు మొగ్గు చూపుతున్నట్లు చాలామంది భావిస్తున్నారు. మరోవైపు, తుపాకీ పరిశ్రమ లాబీయింగ్‌ నేపథ్యంలో ఫార్మసీ, గ్యాస్‌, గ్రాసరీలతోపాటు తుపాకీ స్టోర్లను కూడా అత్యవసర వాణిజ్యం కింద ప్రభుత్వం ప్రకటించింది.

అమెరికాలో పౌరుల వద్ద మొత్తం 40 కోట్ల తుపాకులు ఉండగా, ప్రపంచంలోని మొత్తం తుపాకుల సంఖ్యలో ఇది 46 శాతం కావడం గమనార్హం. అమెరికా సైన్యం వద్ద కన్నా పౌరుల వద్దనే 100 రెట్లు ఎక్కువగా తుపాకులు ఉన్నాయి.

సగటున ఒక్కో అమెరికా పౌరుడి వద్ద ఉన్న తుపాకులు 1.3 అయినప్పటికీ, దేశ జనాభాలో 30 శాతం మంది వద్దనే తుపాకులు ఉండడాన్ని గమనిస్తే 10 కోట్ల మంది వద్ద 40 కోట్ల తుపాకులు ఉన్నట్లు స్పష్టమవుతుంది. రష్యా, చైనా, భారత్‌, అమెరికా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్‌, వియత్నాం, ఇరాన్‌, పాకిస్థాన్‌ సైన్యాల వద్ద ఉన్న మొత్తం తుపాకులకన్నా మూడు రెట్లు ఎక్కువగా అమెరికా పౌరుల వద్ద ఉన్నాయి.