Tamilnadu and AP : భారత వాతావరణ శాఖ (India Meteorological Department(IMD)) తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. పాఠశాలలు, కొన్ని కార్యాలయాలు మూసివేయబడుతాయని,మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని తెలిపింది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని, అందువల్ల ప్రజలు సురక్షితంగా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు కొన్ని ప్రాంతాల్లోరెడ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడం తీవ్రంగా మారిందని IMD తెలిపింది. ఈ మేరకు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు హెచ్చికలతో పాటు కొన్ని సూచనలు చేసింది. మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం వరకు పెను తుఫానుగా మారే అవకాశం ఉంది. దీనికి ‘ఫెంగాల్’ అని పేరు పెట్టారు. చెన్నైలోని మలాడుతురై, తిరువారూర్, నాగపట్నం, చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, చెంగెల్ పేట్, కడూలూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
తమిళనాడు అంతటా తేలికపాటి వర్షాలు కురుస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తుఫానుగా మారే అవకాశం ఉందని అంటున్నారు. వీటిలో కడలూరు,మైడలూరు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుతు తెలిపారు. దీంతో ఆ ప్రాంతాల్లోకి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ పరిస్థితి శుక్రవారం వరకు కొనసాగుతుందని అంటున్నారు. అలాగే చెన్నైకి ఎల్లో అలర్ట్ ప్రకటించినా.. కాంచీపురం,తిరువళ్లూరు, చెంగల్ పేట జిల్లాలో బుధవారం నుంచి శనివారం వరకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు కొనసాగుతాయని తెలిపారు.
తమిళనాడులోని నాగపట్నం నుంచి 520 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంత్రీ కృతమై ఉంది. ఇది బుధవారం నాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యమైన పనులకు తప్ప అనవసరంగా బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఏవైనా ప్రయాణాలు ఉంటే మూడు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని చెబుతున్నారు. ‘పెంగల్’ పెను తుఫానుగా మారే అవకాశలు ఎక్కువగా ఉన్నందున వాతావరణ హెచ్చరికలు గమనించాలని అంటున్నారు.
ఇదిలా ఉండగా ‘ఫెంగల్ ’ ప్రభావం ఏపీలోని కొన్ని జిల్లాలపై పడనుంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం నుంచే వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షలు కురవనున్నాయి. అందువల్ల ఈ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని తెలుపుతున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లడం మానుకోవాలని సూచిస్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.