పెగసాస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్ అట్టుడుకుతోంది. కొద్దిరోజులుగా విపక్షాలు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెగాసన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చించాలని కోరుతున్నాయి. విపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనకు దిగుతుండడంతో గందరగోళం నెలకొంది.
ప్రతిరోజు వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. పెగసాస్ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని కేంద్రప్రభుత్వం ఆదేశించాలని కోరుతూ మంగళవారం ప్రతిపక్ష పార్టీలు రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. పెగసాస్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు విపక్ష ఎంపీలు వాయిదా తీర్మాణానికి నోటీసులు అందజేశారు. పెగసాస్ వ్యవహారంపై ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై 14 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ వద్ద సమావేశమయ్యాయ. అనంతరం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన పెగసాస్ పై ప్రధాని నరేంద్రమోడీ స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడుతూ మనుగడకే మచ్చ తెస్తున్నారని మండిపడ్డారు. పెగసాస్ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని పట్టుపడుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు
ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని కోరారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయని కేంద్రం విపక్షాలపై ఆరోపణలు చేస్తోంది. రాహుల్ గాంధీ మాత్రం ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తుందని విమర్శిస్తున్నారు. పెగసాస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసి ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించాలని చెప్పారు. పెగసాస్ వ్యవహారంపై సంబంధిత అధికారులను సమాచార సాంకేతికతకు చెందిన పార్లమెంటరీ ప్యానెల్ ప్రశ్నించనుంది.