ఎస్ఈసీపై పెద్దిరెడ్డి.. సజ్జల తిట్ల దండకం..

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు.. వైసీపీ నాయకులకు అసలే పడడం లేదు. నిమ్మగడ్డ తీసుకుంటున్న అధికారిక నిర్ణయాలు.. జగన్ అండ్ టీంకు చిర్రెత్తుకొస్తున్నాయి. నిమ్మగడ్డ ఓ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా.. తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ఓ రిటైర్డ్ ఆఫీసర్.. ఆయన మాట మేము వినేదని పెద్ది రెడ్డి లాంటి మంత్రలు కూడా మాట్లాడుతున్నారు. ఇద్దరూ వీటితోనే ఆగిపోవడం లేదు. తమకు ఏది వ్యతిరేకం ఉంటే.. దాన్ని చంద్రబాబుకు లింక్ పెట్టేసే వ్యూహాన్ని ఇక్కడా […]

Written By: Srinivas, Updated On : January 28, 2021 10:42 am
Follow us on


నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు.. వైసీపీ నాయకులకు అసలే పడడం లేదు. నిమ్మగడ్డ తీసుకుంటున్న అధికారిక నిర్ణయాలు.. జగన్ అండ్ టీంకు చిర్రెత్తుకొస్తున్నాయి. నిమ్మగడ్డ ఓ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా.. తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ఓ రిటైర్డ్ ఆఫీసర్.. ఆయన మాట మేము వినేదని పెద్ది రెడ్డి లాంటి మంత్రలు కూడా మాట్లాడుతున్నారు. ఇద్దరూ వీటితోనే ఆగిపోవడం లేదు. తమకు ఏది వ్యతిరేకం ఉంటే.. దాన్ని చంద్రబాబుకు లింక్ పెట్టేసే వ్యూహాన్ని ఇక్కడా అమలు చేయాలని చూస్తున్నారు. చివరికి వీరి వ్యాఖ్యలపై నిమ్మగడ్డ ఏకంగా గవర్నర్ కే ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read: నిమ్మగడ్డ బదిలీ చేసిన అధికారులకు జగన్ అందలం

గవర్నర్ తో భేటీ అయిన సమయంలో వైసీపీ నాయకుల నోరు అదుపులో ఉండేలా చూడాలని ముఖ్యంగా.. సజ్జల, పెద్దిరెడ్డిని కంట్రోల్ చేయాలని.. అనుచిత వ్యాఖ్యలు చేయకుండా చూడాలని నిమ్మగడ్డ గవర్నర్ను కోరినట్లు సమాచారం. అయినప్పటికీ.. అదేరోజు సాయంత్రం మళ్లీ పెద్దిరెడ్డి.. సజ్జల నిమ్మగడ్డపై విరుచుకు పడ్డారు. మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడు రెచ్చిపోయేలా మాట్లాడారు.

అయితే వీరి మాటలతో నిమ్మగడ్డను రెచ్చగొట్టి కంట్రోల్ తప్పేలా చేయాలనే వ్యూహాన్ని వైసీపీ పెద్దలు అనుసరిస్తున్నారు. అందుకే కావాలని తిట్ల దండకం అందుకుంటున్నారు. కోడ్ అమలులోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ప్రకటనలకు సంబంధించి.. ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలసి ఉంటుంది. అయితే ఇటీవల ఏకగ్రీవాలకు సంబంధించిన ప్రకటనలకు సంబంధించి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. అలాగే ఏకగ్రీవాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.ఎస్ఈసీ నిర్ణయంపై తప్పు పడుతున్నారు. వారు సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నారని.. విమర్శిస్తున్నారు.

Also Read: రంగంలోకి సీఎం జగన్.. ఆ ఇద్దరు అధికారులకు క్లీన్ చిట్..?

ఎస్ఈసీపై తీవ్రమైన విమర్శలు చేయడం ద్వారా.. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం చేయడం ద్వారా.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేకపోతే.. నామినేషన్లు వేయకుండా గతంలో చేసినట్లు.. అడ్డుకోకుండా చూసుకోవచ్చని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. బలవంతంగా ఏకగ్రీవాలను అడ్డకుంటే.. టీడీపీకి సాయం చేసినట్లేనని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వారి విమర్శలను మనసులులో పెట్టుకునే ఆలోచన ఇప్పుడు చేయడం లేదు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడానికి ముందుకు సాగుతున్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని.. వైసీపీ నేతలు భావిస్తున్నారని.. ఆ ప్రభావం వారిపై భవిష్యత్ లో తీవ్రస్థాయిలో ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్