https://oktelugu.com/

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పిన విద్యాశాఖ..?

ఏపీ విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ వల్ల పదో తరగతి విద్యార్థులకు తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి సంవత్సరం విద్యార్థులు 11 పేపర్లు రాయాల్సి ఉండగా ఈ ఏడాది విద్యాశాఖ ఏడు పేపర్లకు పరిమితం చేసింది. ఫలితంగా విద్యార్థులకు ఒత్తిడి తగ్గనుంది. Also Read: విద్యార్థులకు శుభవార్త.. రూ.20,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..? విద్యాశాఖ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 28, 2021 / 10:38 AM IST
    Follow us on

    ఏపీ విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ వల్ల పదో తరగతి విద్యార్థులకు తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి సంవత్సరం విద్యార్థులు 11 పేపర్లు రాయాల్సి ఉండగా ఈ ఏడాది విద్యాశాఖ ఏడు పేపర్లకు పరిమితం చేసింది. ఫలితంగా విద్యార్థులకు ఒత్తిడి తగ్గనుంది.

    Also Read: విద్యార్థులకు శుభవార్త.. రూ.20,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..?

    విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్ నిన్న సమీక్ష నిర్వహించి పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నెల 17వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని సమాచారం. నవంబర్ 2 నుంచి తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఏకంగా ఐదు నెలల పనిదినాలను నష్టపోయారు.

    Also Read: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..?

    ఈ ఏడాది సైన్స్ లో మాత్రం వేర్వేరు పేపర్లు ఉంటాయని తెలుస్తోంది. గతేడాది కరోనా విజృంభణ వల్ల రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది. ఒక్కో పేపర్ కు 100 మార్కుల చొప్పున పరీక్షలు జరగనున్నాయని తెలుస్తోంది. జూన్ చివరి వారం నాటికి పరీక్షలు పూర్తవుతాయని జులై తొలి వారంలో పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    అయితే ప్రతి సంవత్సరం పరీక్షల నిర్వహణ తరువాత విద్యార్థులకు సెలవులు ఉండేవి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో సెలవులను రద్దు చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది.