https://oktelugu.com/

పెళ్లికి రెండు రోజుల ముందు ఫోన్ స్విఛాఫ్ చేసిన పెళ్లికూతురు.. చివరకు..?

దేశంలో రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఒక మోసం వెలుగులోకి వస్తే సైబర్ మోసగాళ్లు మరో మోసానికి తెర లేపుతున్నారు. తాజాగా ఒక సైబర్ నేరస్తురాలు పెళ్లి చేసుకుంటామని నమ్మించి ప్రేమించిన యువకుడి నుంచి ఏకంగా 14 లక్షల రూపాయలు తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని పద్మారావు నగర్ లో నివశిస్తున్న అర్జున్ గత రెండు సంవత్సరాలుగా టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆరోగ్య చిట్కాలను, ఆరోగ్య వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. Also […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 28, 2021 / 11:09 AM IST
    Follow us on

    దేశంలో రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఒక మోసం వెలుగులోకి వస్తే సైబర్ మోసగాళ్లు మరో మోసానికి తెర లేపుతున్నారు. తాజాగా ఒక సైబర్ నేరస్తురాలు పెళ్లి చేసుకుంటామని నమ్మించి ప్రేమించిన యువకుడి నుంచి ఏకంగా 14 లక్షల రూపాయలు తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని పద్మారావు నగర్ లో నివశిస్తున్న అర్జున్ గత రెండు సంవత్సరాలుగా టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆరోగ్య చిట్కాలను, ఆరోగ్య వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

    Also Read: ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. 50 శాతం ఛాయిస్..?

    అతని వీడియోలను చూసిన ఒక యువతి తన పేరు వర్ణనా మల్లిఖార్జున్ అని పరిచయం చేసుకుంది. తొలుత ఇన్ స్టాగ్రామ్ ద్వారా అతనితో చాటింగ్ చేసిన వర్ణన ఆ తరువాత వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా పరిచయం పెంచుకుంది. వర్ణన తన తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే చనిపోయారని కజిన్ సిస్టర్ తనను, తన తమ్ముడు సునీత్ రాయ్ చౌదరిని చదివించిందని వర్ణన అర్జున్ కు తెలిపారు. ప్రస్తుతం తాను విజయవాడలో ఉంటున్నానని ఎర్నాకుళం మెడికల్ కాలేజీలో డెంటల్ కాలేజీలో చదువుకున్నానని ఆమె అన్నారు.

    Also Read: 43 శాతం అడిగారు.. 7.5శాతం ఫిట్ మెంట్ ఉద్యోగుల చేతిలో పెట్టిన కేసీఆర్

    వర్ణన పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టగా అర్జున్ అందుకు అంగీకరించాడు. ఆ తరువాత వర్ణన తమ్ముడికి ల్యాప్ టాప్ కావాలని, తమ్ముడికి కరోనా సోకిందని తమ్ముడిని హైదరాబాద్ కు పంపి ల్యాప్ టాప్ ను అర్జున్ తో కొనిపించడంతో పాటు సునీత్ కు కరోనా చికిత్స కోసం అర్జున్ రూ.4.60 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. అదే సమయంలో వర్ణనకు బహుమతిగా లక్షన్నర రూపాయల నెక్లేస్ ను కొనిచ్చాడు.

    మరిన్ని వార్తలు కోసం: జనరల్

    ఆ తరువాత నవంబర్ లో పెళ్లి చేసుకోవాలని డేట్ ఫిక్స్ చేసుకొన్నారు. వర్ణన పెళ్లి ఖర్చుల కోసం 8 లక్షల రూపాయలు, బంగారు ఉంగరం అడగగా వాటిని అర్జున్ ఆమెకు పంపించాడు. పెళ్లికి రెండు రోజుల ముందు వర్ణన, సునీత్ ఫోన్లు స్విఛాఫ్ అయ్యాయి. ఆ తరువాత వర్ణన చేసిన మోసం అర్థం కావడంతో అర్జున్ తాజాగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.