Peddireddy Ramachandra Reddy: అధికారం ఉండాలే కానీ ఏదైనా సాధ్యమే. కోరిందల్లా తీసుకురావచ్చు. కొండ మీది కోతినైనా తేవచ్చు. అధికారంలో ఉండే మజా అదే. అనుకున్నదే తడవుగా పనులు కూడా చకచకా జరిగిపోతాయి. ఆదేశాలు జారీ చేస్తే చాలు వాటంతటవే వేగంగా ముందుకు కదులుతాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం కూడా అహర్నిశలు శ్రమించి మంత్రి గారి ఆర్డర్ ను శిరసా వహించి ఆయన చెప్పిందే వేదంగా భావిస్తారు. ఏ పని చెప్పినా తూచ తప్పకుండా చేసేందుకు ఓకే చెప్పేస్తారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన తల్లి కోరికను నెరవేర్చే క్రమంలో ఓ ఆధ్యాత్మిక కార్యాన్ని ఘనంగా నిర్వహించాడు. తమ స్వగ్రామమైన ఎర్రతివారిపల్లెలో సదుం ఎల్లమ్మ ఆలయం శిథిలావస్థకు చేరడంతో దాని ఆలనాపాలన కరువైంది. దీంతో దాన్ని పునర్నిర్మించాలని కోరడంతో దానికి మంత్రి సరే అని ఆగమేఘాల మీద పనులు చేయించి నిర్మాణం పూర్తి చేయించాడు. దీంతో ఆలయాన్ని ప్రారంభించారు.
తల్లి పద్మావతమ్మ కోరికను మంత్రి తీర్చారు. ఆలయ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండు నెలల్లోనే ఆలయ నిర్మాణం పూర్తి చేయించారు. సోమవారం ఆలయంలో కుంబాభిషేకం నిర్వహించి తన తల్లి కోరికను నూటికి నూరుపాళ్లు నెరవేర్చాడు. దీంతో తల్లి కొడుకును దీవించింది.
Also Read: MLA Roja: మంత్రి పదవి కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యే కూడా కాదంట..?
రాష్ర్టంలో అధికారంలో ఉంటే ఆ దర్జాయే వేరుగా ఉంటుంది. వారు ఏది అనుకుంటే అది త్వరగా జరిగిపోతుంది. వారు కోరుకుంటే ఏదైనా ఇట్టే తీరిపోతోంది. తల్లి కోరుకున్నట్లుగా ఆలయం నిర్మించడంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చొరవకు అంతా ముగ్దులవుతున్నారు.
Also Read: Narendra Modi: ఇందుకే మోడీ.. ప్రజల మనుసు గెలిచేది?