TRS: టీఆర్ఎస్‌ను కమ్మేసిన నిశ్శబ్దం.. సెలబ్రేషన్స్‌కు కేడర్ దూరం.. అసలేమైంది?

TRS:  తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని నిశ్శబ్ద మేఘాలు కమ్ముకున్నట్టు తెలుస్తోంది. మొన్నటివరకు రైతుల కోసం గళమెత్తడమే కాకుండా ఇందిరా పార్క్ వద్ద ఏకంగా ధర్నాకు దిగిన కేసీఆర్ అండ్ కేసీఆర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. తండ్రి కొడుకులు ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. సీఎం స్టాలిన్‌ను కలిసి యాదాద్రి పర్యటనకు ఆహ్వానించడానికి కేసీఆర్ అండ్ కేటీఆర్ వెళ్లారని అంతా అనుకుంటున్నారు. కానీ దానివెనుక వేరే రాజకీయ కోణం ఉందని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. తెలంగాణ […]

Written By: Neelambaram, Updated On : December 14, 2021 6:59 pm
Follow us on

TRS:  తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని నిశ్శబ్ద మేఘాలు కమ్ముకున్నట్టు తెలుస్తోంది. మొన్నటివరకు రైతుల కోసం గళమెత్తడమే కాకుండా ఇందిరా పార్క్ వద్ద ఏకంగా ధర్నాకు దిగిన కేసీఆర్ అండ్ కేసీఆర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. తండ్రి కొడుకులు ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. సీఎం స్టాలిన్‌ను కలిసి యాదాద్రి పర్యటనకు ఆహ్వానించడానికి కేసీఆర్ అండ్ కేటీఆర్ వెళ్లారని అంతా అనుకుంటున్నారు. కానీ దానివెనుక వేరే రాజకీయ కోణం ఉందని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. తెలంగాణ వచ్చిన కొత్తలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చాక ప్రతీ ఏడాది యానివర్సరీలు నిర్వహించిన టీఆర్ఎస్ ఈసారి ఎందుకో మౌనంగా ఉంది. గులాబీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం కరువైంది.

TRS

బంగారు తెలంగాణ దిశగా అడుగులు..

ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతీ ఏటా అధిష్టానం ఆదేశాల మేరకు గులాబీ శ్రేణులు ఫుల్లు ఏంజాయ్ చేసేవారు. ముఖ్యమంత్రి పాలన ఎలా అందస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ తెలిసేలా పెద్దపెద్ద హోర్డింగులు ఏర్పాటు చేసి సెలబ్రేషన్స్ జరిపేవారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 13న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గతంతో ఏటా యానివర్సరీలు నిర్వహించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి ఎందుకు మౌనంగా ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నందువల్లేనా..

రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నది. సీఎం కేసీఆర్ నియంత పాలన, మంత్రి కేటీఆర్ నిరంకుశత్వం, ఉద్యమకారులను పక్కనబెట్టి ఉద్యమ ద్రోహులకు ఆ పార్టీ అందలం ఎక్కిస్తోంది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నానాటికీ పెరిగిపోతోంది. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మర్చారన్న ప్రతిపక్షాల మాటలను ప్రజలు గట్టిగానే విశ్వసిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో జరిగిన మొత్తం మూడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు గట్టి సంకేతాలను ఓట్ల రూపంలో ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మెజార్టీ కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. కేసీఆర్ పాలన మీద 75శాతం ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు పెరిగిపోయాయి. ప్రతీ దాంట్లో టీఆర్ఎస్ నేతల హస్తముందంటూ ప్రతీరోజు పత్రికల్లో కథనాలు రావడంతో ఆ పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుంది.

Also Read: Harish Rao: ఆర్థిక, వైద్యశాఖపై కాకుండా విద్యుత్ శాఖపై హరీశ్ రావు సమీక్ష.. అసలు ఏం జరుగుతోంది?

ఈ క్రమంలోనే వేడుకలకు అధికార పార్టీ దూరంగా ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలువాలనేదానిపై ఇప్పటి నుంచే అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. అయితే, ఈసారి ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకోవాలని కూడా టీఆర్ఎస్ చూస్తున్నదని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతీ ఎన్నికల్లో ప్రత్యేకంగా వ్యూహాలు అమలుచేసే కేసీఆర్ ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగుతారా? పీకే సాయం తీసుకుంటారా? లేదా మళ్లీ కొత్త సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ముందుకు వస్తారా? అనేది వేచిచూడాలి.

Also Read: Telangana MLC Elections Results: ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ దూకుడు.. ఆస‌క్తిక‌రంగా కౌంటింగ్‌..

Tags