Mahesh Babu: ఆ స్థానంలో ఫిక్స్ అయిన మహేష్.. మిగతా ప్లేసులే మారుతున్నాయి?

Mahesh Babu:  తెలుగులో క్రేజ్ ఉన్న హీరోల్లో ఏడాది కాలంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నెంబర్ వన్ గా కొసాగుతున్నాడు. దీంతో రెండు, మూడు స్థానాల కోసం మిగిలిన హీరోలంతా పోటీపడుతున్నారు. ఈక్రమంలోనే మహేష్ స్థానం ఫిక్స్ అయిపోవడంతో మిగిలిన స్థానాలు మారుతూ వస్తున్నాయి. తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రకటించిన పాపుల హీరోల లిస్టులో మళ్లీ మహేష్ బాబు నెంబర్ వన్ గా నిలిచి టాలీవుడ్లో తనకు ఎదురులేదని నిరూపించాడు. ప్రముఖ పాపులర్ సర్వే […]

Written By: NARESH, Updated On : December 15, 2021 11:09 am
Follow us on

Mahesh Babu:  తెలుగులో క్రేజ్ ఉన్న హీరోల్లో ఏడాది కాలంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నెంబర్ వన్ గా కొసాగుతున్నాడు. దీంతో రెండు, మూడు స్థానాల కోసం మిగిలిన హీరోలంతా పోటీపడుతున్నారు. ఈక్రమంలోనే మహేష్ స్థానం ఫిక్స్ అయిపోవడంతో మిగిలిన స్థానాలు మారుతూ వస్తున్నాయి. తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రకటించిన పాపుల హీరోల లిస్టులో మళ్లీ మహేష్ బాబు నెంబర్ వన్ గా నిలిచి టాలీవుడ్లో తనకు ఎదురులేదని నిరూపించాడు.

Mahesh Babu

ప్రముఖ పాపులర్ సర్వే కంపెనీ అయిన ఆర్మాక్స్ మీడియా ప్రతినెలా సోషల్ మీడియా, సినిమా, టీవీ రంగాల్లో అనేక సర్వేలు నిర్వహించి వివరాలు వెల్లడిస్తూ ఉంటుంది. తాజాగా నవంబర్ నెలకు సంబంధించిన టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు హీరోగా ఎవరో తేల్చేసింది. గత 11నెలలుగా మహేష్ బాబు నెంబర్ వన్ గా కొనసాగుతుండగా ఈనెలలోనూ ఆయనే నెంబర్ వన్ అని తేల్చేసింది.

దీంతో ఏడాదికాలంగా మహేష్ బాబే టాలీవుడ్లో మోస్ట్ పాపులర్ తెలుగు హీరోగా రికార్డు నెలకొల్పాడు. మహేష్ బాబు ఈ ఏడాది జనవరిలోనే ‘సరిలేరునికెవ్వరు’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం ‘సర్కారువారిపాట’లో నటిస్తున్నాడు. ఈమూవీ సంక్రాంతికి రావాల్సి ఉండా ఏప్రిల్ నెలకు వాయిదా పడింది.

ఇక ఆ తర్వాతి స్థానంలో అల్లు అర్జున్ ఉండగా ప్రభాస్ అతడిని బీట్ చేసి రెండో ప్లేసుకు చేరుకున్నారు. దీంతో అల్లు అర్జున్ మూడోస్థానానికి పడిపోవాల్సి వచ్చింది. అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో ఈనెలలో వస్తుండగా ప్రభాస్ ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘స్పిరిట్’ మూవీలో ఫుల్ బీజీగా ఉన్నాడు. గత నెలలో రెండోస్థానంలో అల్లు అర్జున్ ఉండగా ఆ స్థానాన్ని ప్రస్తుతం ప్రభాస్ దక్కించుకున్నాడు.

కిందటి నెలలో ఐదోస్థానంలో ఉన్న యంగ్ టైగన్ ఎన్టీఆర్ ఈసారి నాలుగో ప్లేసుకు చేరుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. పవన్ కల్యాణ్ గత నెలలో నాలుగో స్థానంలో ఇప్పుడు ఐదో స్థానానానికి పడిపోయాడు.. ‘వకీల్ సాబ్’ రీఎంట్రీ తర్వాత పవన్ కల్యాణ్ వరుస మూవీలు చేస్తున్నారు.

రాంచరణ్ తన ఆరోస్థానాన్ని నిలబెట్టుకున్నారు. రాంచరణ్ నుంచి చివరగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయవిధేయరామ’ మూవీ వచ్చింది. ప్రస్తుతం ఆయ ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాల్లో నటిస్తున్నాడు. కిందటి నెలలో ఎనిమిదో స్థానంలో ఉన్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏడో స్థానానికి ఎగబాకాడు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ మూవీలో నటిస్తున్నాడు.

Also Read: ఆ హీరోయిన్ కి డేటింగ్ లు, కేసులు కొత్తేమి కాదట !

కిందటి సారి ఏడో ప్లేసులో ఉన్న నాని ప్రస్తుతం ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. నాని నుంచి చివరగా ‘టక్ జగదీష్’ మూవీ వచ్చింది. ఈనెల 24న నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ విడుదల కానుంది. కిందటి నెలలో పదో స్థానంలో ఉన్న చిరంజీవి ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.

‘సైరా’ తర్వాత ఆయన నుంచి మూవీ రాలేదు. చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఫిబ్రవరిలో రానుండగా వరుసగా సినిమాలు చేస్తూ బీజీగా ఉన్నారు. లేటు వయస్సులోనూ కుర్ర హీరోలకు ధీటుగా చిరంజీవి సినిమాలు చేస్తున్నాడు. ‘లవ్ స్టోరీ’హిట్ తో గత నెల వరకు తొమ్మది స్థానంలో నిలిచిన నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత పదో స్థానానికి పడిపోయాడు.

Also Read: ఏపీ టికెట్​ ధరల విషయంలో తగ్గేదేలే అంటున్న బాలయ్య..