పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి తమ్ముడిగా, సినిమా హీరోగా, వ్యక్తిగతంగానూ పవన్ ను చాలామంది ఇష్టపడుతుంటారు. ఆయనను లక్షల్లో అభిమానులు ఫాలో అవుతుంటాయి. అయితే రాజకీయంగా పవన్ కల్యాణ్ ఏంటనే ప్రశ్ననే తలెత్తుతోంది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించకముందు నుంచే రాజకీయాల్లో ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక పవన్ కల్యాన్ అందులో యాక్టివ్ గా పని చేశారు. యువరాజ్యం అధ్యక్షుడిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిపేయడం.. చిరంజీవి కేంద్రమంత్రిగా చేయడం.. ఉమ్మడి ఆంధప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడం ఇదంతా అందరికీ తెల్సిన సంగతే..
గులాబీ కోటలో ఇక అన్ని కొత్త పుష్పాలే?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందుగానే పవన్ కల్యాణ్ 2014లో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జనసేన పార్టీని స్థాపించారు. సమైక్యాంధ్రకు పవన్ కల్యాన్ మద్దతు తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ, ఆంధప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇక 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పోటీ చేయలేదు. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు చిలీపోతాయనే కారణంగా టీడీపీ, బీజేపీ కూటమిని పవన్ మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమికి ప్రచారం చేశారు. పవన్ మద్దతు ఇచ్చిన కూటమే 2014 ఎన్నికల్లో గెలిచింది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ నిర్మాణంపై ఎక్కడ దృష్టి సారించినట్లు కన్పించలేదు. ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేయడం తప్ప అధికారంలోని టీడీపీని నిలదీసిన పాపానా పోలేదు. దీంతో పవన్ కల్యాణ్ ను చంద్రబాబు నాయుడు వెనుక నుంచి ఆడిస్తున్నారనే భావం ప్రజల్లోకి వెళ్లిపోయింది.
జనసేన పార్టీ స్థాపించిన సమయంలో పవన్ ఇక సినిమాలు చేయనని.. రాజకీయాల్లోనే ఫుల్ టైమ్ ఉంటూ ప్రజలకు సేవచేస్తానని ప్రకటించాడు. 2019 జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి 100కుపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. టీడీపీ, వైసీపీ, బీజేపీలకు వ్యతిరేకంగా పవన్ బీఎస్పీ, వామపక్ష పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని బరిలో దిగాడు. ఈ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీచేసిన గాజువాక, భీమవరం రెండుచోట్ల ఓటమిపాలయ్యాడు. జనసేన కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుపొందింది. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలుపొందారు. ఆయన ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ నియోజకవర్గంలో పనులు చేయించుకుంటున్నారు. దీంతో ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ముద్ర వేయడంతో ఆయన గత కొన్నిరోజుల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నాడు.
అదృష్టం అంటే అతడితే.. రాత్రికిరాత్రే కోటిశ్వరుడయ్యాడు..!
2019 ఎన్నికల ఓటమి తర్వాత పవన్ లో ఏం మార్పు వచ్చిందో తెలియదుగానీ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అడుపదడుప ట్వీటర్లో పోస్టులు పెడుతూ పార్ట్ టైం రాజకీయానికి పవన్ తెరలేపాడు. ఇది ప్రజల్లోకి పార్టీపై తప్పుడు సంకేతాలను తీసుకెళుతోంది. ఒకసారి రాజకీయాల్లోకి దిగాక ఏదో ఒక అంశంపై పోరాడుతూ ప్రజల గొంతును విన్పిస్తేనే ఆ పార్టీ మనుగడ సాధ్యమవుతుంది. కానీ దీనికి భిన్నంగా పవన్ పార్ట్ టైం రాజకీయాలు ప్రజలతోపాటు సొంత పార్టీ నేతల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీని కిందిస్థాయిలో బలపరిచే ఏ ప్రయత్నము పవన్ చేయడంలేదని విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఇప్పటికే పార్టీలోకి కొందరు ముఖ్యనేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.
ప్రస్తుతం ఏపీలో పోటాపోటీ రాజకీయం నడుస్తోంది. గత ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకెళుతోంది. టీడీపీ నిత్యం ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలోనూ బలపడేందుకు ప్లాన్ రచిస్తుంది. కాంగ్రెస్, జనసేన పార్టీలు మాత్రం ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మిన్నకుండిపోతున్నాయి. కిందటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. ఇది పవన్ కు అనుకూలంగా మారే అంశమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీనిని అనుకూలంగా మార్చుకోవాల్సిన సమయంలో పవన్ మౌనంగా ఉండటంతో కిందిస్థాయి నాయకత్వాన్ని నిరాశకు గురిచేస్తోంది.
పవన్ తీరు ఇలానే ఉంటే 2024 ఎన్నికల్లోనూ జనసేన పుంజుకోవడం కష్టమనే వాదనలు సొంత పార్టీ నుంచే విన్పిస్తుంది. ఇప్పటికైనా పవన్ పార్టీ నిర్మాణం, ప్రజా కార్యక్రమాలపై దృష్టిసారించకుంటే 2024తర్వాత పవన్ పూర్తిగా రాజకీయ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు రావచ్చొని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరీ పవన్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెడుతారో లేదో వేచి చూడాల్సిందే..!