ఏపీలో టీడీపీ పతనానికి తెలంగాణ ఫార్ములా?

తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయినట్టే. కీలక నేతలంతా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోవడంతో ఇక తెలంగాణలో ఆ పార్టీ అంతర్థానం అయినట్టే కనిపిస్తోంది. తెలంగాణలో ఒకప్పుడు టీడీపీ బలీయమైన శక్తిగా ఉండేది. 2009లో కూడా టీఆర్ఎస్ కు తక్కువ సీట్లు ఇచ్చి మెజార్టీ సీట్లలో టీడీపీ పోటీచేసింది. అలాంటి పార్టీని తెలంగాణలో లేకుండా చేయడంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజయవంతమయ్యారు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఏపీలో కూడా అమలు చేసే దిశగా వైసీపీ […]

Written By: NARESH, Updated On : June 30, 2020 9:33 am
Follow us on


తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయినట్టే. కీలక నేతలంతా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోవడంతో ఇక తెలంగాణలో ఆ పార్టీ అంతర్థానం అయినట్టే కనిపిస్తోంది. తెలంగాణలో ఒకప్పుడు టీడీపీ బలీయమైన శక్తిగా ఉండేది. 2009లో కూడా టీఆర్ఎస్ కు తక్కువ సీట్లు ఇచ్చి మెజార్టీ సీట్లలో టీడీపీ పోటీచేసింది. అలాంటి పార్టీని తెలంగాణలో లేకుండా చేయడంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజయవంతమయ్యారు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఏపీలో కూడా అమలు చేసే దిశగా వైసీపీ అధిష్టానం రంగం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

కేసీఆర్ టార్గెట్ గా.. రాష్ట్రానికి కేంద్ర బృందం రానుందా?

టీడీపీని నమ్ముకున్న నేతలు, కార్యకర్తల్లో ఆ నమ్మకం సడలేలా వైసీపీ అధిష్టానం వ్యూహ రచన చేస్తోందని పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. దారికి రాని బలమైన టీడీపీ నేతలను జైలుకు పంపడం..తద్వారా అలిగేషన్స్ ఉన్న నేతలను డిఫెన్స్ లో పడేయడం.. మాజీ మంత్రులు, నేతలను వైసీపీలో చేర్చుకోవడం.. టీడీపీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతోంది.

ప్రస్తుతం జగన్ ధాటికి ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్భర స్థితిలోకి జారిపోయింది. పార్టీ తన ఉనికి కాపాడుకోవడానికి.. నేతలను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కావడం లేదు. తెలంగాణలో లాగే ఏపీలోనూ చంద్రబాబు ప్రయత్నాలన్నీ ఫలించడం లేదు. చంద్రబాబుపై నేతలు, కార్యకర్తల్లో నమ్మకం సడలేలా చేయడంలో జగన్ వ్యూహాలు బాగా పనిచేస్తున్నాయంటున్నారు.

సుజనా చౌదరిని కలిసిన వారిలో వైసీపీ నేతలు?

కానీ ఇప్పటికీ టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబే టీడీపీకీ ఆయువు పట్టు అని పేర్కొంటూ ప్రచారం చేస్తున్నా నేతలు, కార్యకర్తల్లో ఆయనపై నమ్మకం కుదరడం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను కూడా ప్రభావితం చేయగలనని ఒకప్పుడు ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు ఇప్పుడు ఆ చాణక్యం పనిచేయకపోవడం.. ఏపీలో వరుస ఎదురుదెబ్బలు టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పార్టీపై చంద్రబాబు పట్టు సడలిపోతుందనడానికి తాజా ఉదాహరణలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆ జిల్లాలో నిరసన తెలుపాలని చంద్రబాబు పిలుపునిచ్చినా ముఖ్య టీడీపీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ నిరసన చేపట్టలేదు. పార్టీ కార్యకర్తలు కూడా హాజరు కాలేదు. ఇక అచ్చెన్నాయుడును అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నా అక్కడ టీడీపీ నేతల్లో ఉలుకుపలుకూ లేదు. క్యాడర్ కూడా ప్రశాంతంగానే ఉంది.

ఇలా చంద్రబాబు పిలుపునిచ్చినా క్యాడర్, నేతలు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. స్వయంగా నారాలోకేష్ పర్యటించినా అనంతపురం, శ్రీకాకుళంలో ఆయన వెంట ఆ జిల్లా టీడీపీ నేతలు ఉండలేదు. దీన్ని బట్టి జగన్ ధాటికి టీడీపీ నేతలంతా సర్దుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన స్ట్రాటజీనే ఏపీలో జగన్ అమలు చేస్తున్నారు. చంద్రబాబుపై , పార్టీపై నమ్మకం కోల్పోయేలా చేస్తున్నారు. తద్వారా టీడీపీ నేతలను దూరం చేసే ఎత్తుగడను అమలు చేస్తున్నారు.

-ఎన్నం