
నాకు కుళ్ళు, మోసపూరిత రాజకీయాలు చేయడం చేతకాదని ప్రజలకు కష్టం వచ్చినా.. ఆపద వచ్చినా తానే ముందుండి వారి తరుపున నిలుస్తానని పదే పదే చెప్పుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మాటలను మరోసారి నిజం చేశారు. కరోనా విపత్తుపై తనదైన శైలిలో స్పందించి ఇప్పటికే రెండు కోట్ల రూపాయలను విపత్తు నిధికి అందచేసిన పవన్ కళ్యాణ్ మరో ముందడుగు వేశారు. రాజకీయాలు వేరు సమస్యలు వేరు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన తన ట్విట్టర్ ద్వారా కరోనా విపత్తు వేళ తన మానవతా దృక్ఫదాన్ని మరోసారి చాటుకున్నారు. కరోనా తో ఇబ్బందులు పడుతుతున్న ప్రజలను ఆదుకోవాలని జనసైనికులకు పిలుపు ఇచ్చారు .
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా విషయంలో తీసుకునే చర్యలకు జనసేన మద్దతు ఉంటుందని పవన్ తెలిపారు. జగన్ సర్గార్ కి ఇటువంటి విపత్కర పరిస్థితిలో జనసేన పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పారు.రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు.వారి వారి బాధ్యతలు వారు నిర్వహిస్తారు అదేసమయంలో ప్రతి జనసైనికుడు కూడా ప్రభుత్వానికి సహకరించాలని, ప్రజలకు మేలే చేసే విషయంలో ముందుడాలని జనసైనికులను అలర్ట్ చేశారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. మార్కెట్లు మూసివేయడంతో మామిడి రైతులు భారీ నష్టాలు వస్తాయని భయపడుతున్నారని అందువల్ల దానికి సంబంధించిన చర్యలు ప్రభుత్వం చేపట్టాలనీ కోరారు. ఇక మహిళలపై నెలకొన్న ఒత్తిడిని దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పిన జనసేనాని స్వయం సహాయక బృందాలకు సంబంధించిన లోన్ తిరిగి కట్టేందుకు జూన్ వరకూ అవకాశం ఇవ్వాలనీ కోరారు.