Homeఎంటర్టైన్మెంట్మహేష్ 27వ సినిమా సెంటిమెంట్ల ఖజానా

మహేష్ 27వ సినిమా సెంటిమెంట్ల ఖజానా

సరిలేరు నీకెవ్వరూ చిత్రం తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకొన్న మహేష్ బాబు ఇపుడు తన కొత్త చిత్రం ప్రారంభానికి సన్నాహాలు చేసు కొంటున్నాడు. నిజానికి మహేష్ బాబు 27 వ సినిమా మహర్షి ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వం లో చేయాలి. కానీ మహేష్ బాబు కి పూర్తి కథ నచ్చక పోవడం తో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో ఇపుడు గీత గోవిందం ఫేమ్ పరశురామ్ రంగం లోకి వచ్చాడు. నిజానికి పరశురామ్ పూర్తి […]

సరిలేరు నీకెవ్వరూ చిత్రం తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకొన్న మహేష్ బాబు ఇపుడు తన కొత్త చిత్రం ప్రారంభానికి సన్నాహాలు చేసు కొంటున్నాడు. నిజానికి మహేష్ బాబు 27 వ సినిమా మహర్షి ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వం లో చేయాలి. కానీ మహేష్ బాబు కి పూర్తి కథ నచ్చక పోవడం తో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో ఇపుడు గీత గోవిందం ఫేమ్ పరశురామ్ రంగం లోకి వచ్చాడు.

నిజానికి పరశురామ్ పూర్తి స్క్రిప్ట్ తో సినిమాకి రెడీ గా ఉన్నప్పటికీ కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. కాబట్టి పరుశురామ్ కి కావాల్సినంత టైమ్ దొరికింది. అందుకే స్క్రిప్ట్ ని మరింతగా మెరుగులు దిద్దే పనిలో పడ్డాడు దర్శకుడు పరశురామ్.

కాగా విశ్వసనీయం గా తెలుస్తున్న దాన్ని బట్టి మహేష్ బాబు 27 వ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం జూలైలో చేయాలనుకుంటున్నారట. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పరశురామ్ కథలో హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉందనిపించి ఆమెను కాంటాక్ట్ చేయమన్నాడట మహేష్ బాబు. కరోనా వైరస్ ప్రభావం తగ్గి.. లాక్ డౌన్ ఎత్తి వేయగానే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అవుతాయి.

అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుక గా ఏప్రిల్ 28న విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్నిఆ రోజున విడుదల చేయడానికి ప్రత్యేక కారణముంది. సరిగ్గా ఇదే రోజున 14 ఏళ్ల క్రితం అంటే 2006లో మహేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పోకిరి చిత్రం విడుదలైంది. అందుకే ఆ డేట్ ని మహేష్ ఎన్నుకోవడం జరిగింది.
.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper