https://oktelugu.com/

పవన్‌ సారూ.. ఇంకా ఆ చట్టం అమల్లోకి రాలేదు..?

2019 ఎన్నికల తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఏపీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్య జమిలీ ఎన్నికల మూమెంట్‌ కనిపిస్తుండడంతో మరోసారి పార్టీ ఊపును తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు పవన్‌. ఇప్పటికే సినిమాల్లో బిజీగా ఉన్న పవన్‌.. అడపాదడపా కార్యక్రమాలు చేస్తూ పార్టీ బతికే ఉందన్నట్లుగా చాటుతున్నారు. అయితే.. రాష్ట్రంలో మాత్రం ఏం జరుగుతుందోననే విషయాలు ఆయనకు పెద్దగా తెలియడం లేదన్నట్లుగా అర్థమవుతోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. Also Read: అమరావతిపై అంటరాని ముద్ర..: […]

Written By: , Updated On : December 25, 2020 / 07:10 PM IST
Pawan
Follow us on

Pawan Kalyan
2019 ఎన్నికల తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఏపీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్య జమిలీ ఎన్నికల మూమెంట్‌ కనిపిస్తుండడంతో మరోసారి పార్టీ ఊపును తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు పవన్‌. ఇప్పటికే సినిమాల్లో బిజీగా ఉన్న పవన్‌.. అడపాదడపా కార్యక్రమాలు చేస్తూ పార్టీ బతికే ఉందన్నట్లుగా చాటుతున్నారు. అయితే.. రాష్ట్రంలో మాత్రం ఏం జరుగుతుందోననే విషయాలు ఆయనకు పెద్దగా తెలియడం లేదన్నట్లుగా అర్థమవుతోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.

Also Read: అమరావతిపై అంటరాని ముద్ర..: జగన్‌ కొత్త రాజకీయం

అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే యువతిని ఓ కుర్రాడు చంపేశాడు. కేసుకు సంబంధించి యువకుడిని పట్టుకున్న పోలీసులు అనేక కేసులు నమోదుచేశారు. ఈ విషయమై పవన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘దిశా’ చట్టంతో ఉపయోగం ఏమిటంటూ ప్రశ్నించారు. దిశాచట్టాన్ని ప్రభుత్వం కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకుంటోందంటూ మండిపడ్డారు. చట్టం చేయటం కాదని దాన్ని సక్రమంగా ఉపయోగించాలని సలహా కూడా ఇచ్చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం దిశచట్టం చేయటం వరకు కరక్టే. కానీ దాన్ని కేంద్రప్రభుత్వం ఆమోదించలేదు. దిశాచట్టంలో సవరణలను ప్రతిపాదించి మళ్లీ బిల్లును రాష్ట్రానికే పంపింది. కేంద్రం నుంచి రిటర్న్ అయిన బిల్లుకు సవరణలు చేర్చి మళ్లీ రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి పంపాలి. అప్పుడు పార్లమెంటులో పాసైతే రాష్ట్రపతి సంతకం తర్వాత దిశచట్టం అమల్లోకి వస్తుంది. ఇంతచిన్న విషయం కూడా తెలీకుండానే అమల్లో లేని చట్టం గురించి పవన్ మాట్లాడుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.

Also Read: జగనన్న ఇల్లు ఎంతో తెలుసా..?

ధర్మవరం కేసులో యువకుడిపై ప్రయోగించిన చట్టాల విషయంలో హోంశాఖ మంత్రి సుచరిత స్పష్టంగా ప్రకటించారు. అయినా పవన్ మాత్రం తన ధోరణిలోనే తాను ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలతో రెచ్చిపోయారు. అంటే ఎక్కడ అవకాశం దొరికినా వెంటనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసేయాలన్న ధ్యాసే తప్ప వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలనే నైతికత పవన్‌కు లేదనేది స్పష్టమవుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్