
టాలీవుడ్ ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు. ఏ మూవీ తీసినా ఇండస్ట్రీ హిట్. తీసినవి కొన్ని సినిమాలే అయినా.. ఎక్కడ ఫెయిల్యూర్స్ లేవు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానుల్లో అదో కిక్. ఇప్పుడు ఆ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీని తెరకెక్కిస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ కథనాయకులుగా నటిస్తున్నారు. రౌద్రం రుధిరం రణం పేరుతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఇక రాంచరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. లాక్ డౌన్ అనంతరం అలియా భట్‌తో షూటింగ్ ప్రారంభించిన ఆర్ఆర్ఆర్ టీమ్.. అలియాతో మొదటి షెడ్యూల్ పూర్తి చేసిందట. ఇక ఈ సినిమాతోనే అలియా భట్ తెలుగు తెరకు పరిచయం కానుంది. అయితే అలియాకి తెలుగు బాష అసలు రాదన్న సంగతి తెలిసిందే. కానీ అమ్మడు షూటింగులో తెలుగు డైలాగులు చకచకా చెప్పేస్తుందట.
Also Read: ‘పుష్ప’లో విలన్లే విలన్లు.. : మెయిన్ విలన్ మాత్రం అతనే..
మరి అలియాకి ఇంత తెలుగు ఎక్కడి నుండి వచ్చింది అంటే.. దాదాపు ఏడాదిన్నర కాలంగా అలియా ఆర్ఆర్ఆర్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తోందట. అందుకే.. ఇప్పుడు అలవోకగా తన డైలాగ్స్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం స్వయంగా అలియానే చెప్పడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్ తనకు సరికొత్త అనుభవం. షూటింగ్‌లో జాయిన్ అయ్యే ముందే డైలాగ్స్ అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తా’ అని అంటోంది సొట్టబుగ్గల చిన్నది.
Also Read: ఈ టైమ్ లో అంత బలుపు అవసరమా రవితేజా!
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా సీత క్యారెక్టర్ పోషిస్తోంది. ఆ క్యారెక్టర్ కోసం అలియాను ఎందుకు ఎంచుకున్నారో ఇదివరకే రాజమౌళి చెప్పేసాడు. ‘ఆర్ఆర్ఆర్ లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ లేనప్పటికీ.. సీత పాత్ర సినిమాకి చాలా ముఖ్యమని ఎన్టీఆర్ రాంచరణ్ లాంటి ఇద్దరు టాలెంటెడ్ హీరోలతో పోటీపడి సీత క్యారెక్టర్ ఎమోషన్స్ పండించాలని.. సీత అమాయకురాలు కానీ స్ట్రాంగ్ లేడీ. అంత ప్రాముఖ్యత గల పాత్ర కాబట్టే ఆలియాను ఎంపిక చేసినట్లు’ తెలిపాడు. తన నమ్మకాన్ని నిలబెట్టే సత్తా అలియాకి ఉందని రాజమౌళి తెలపడం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్