https://oktelugu.com/

హైదరాబాద్‌లో ‘కొత్త’ టెన్షన్‌

బ్రిటన్‌ వేదికగా ఇప్పుడు కొత్త రకం వైరస్‌ స్ట్రెయిన్‌ మొదలైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి దేశం మరోసారి లాక్‌డౌన్‌ పెట్టింది. దీంతో ఇండియా పౌరులందరూ రిటర్న్‌ బ్యాక్ అవుతున్నారు. ఇప్పటికే అక్కడి నుంచి వేలాది మంది ఇండియాకు వచ్చేశారు. అందులో తెలంగాణకు చెందిన వారు సైతం ఉన్నారు. ఈ వార్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్‌ అయింది. వెంటవెంటనే వారిని గుర్తించే పనిలో పడింది. దొరికిన వారికి దొరికినట్లుగా టెస్టులు చేయిస్తోంది. Also Read: […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 25, 2020 / 07:03 PM IST
    Follow us on


    బ్రిటన్‌ వేదికగా ఇప్పుడు కొత్త రకం వైరస్‌ స్ట్రెయిన్‌ మొదలైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి దేశం మరోసారి లాక్‌డౌన్‌ పెట్టింది. దీంతో ఇండియా పౌరులందరూ రిటర్న్‌ బ్యాక్ అవుతున్నారు. ఇప్పటికే అక్కడి నుంచి వేలాది మంది ఇండియాకు వచ్చేశారు. అందులో తెలంగాణకు చెందిన వారు సైతం ఉన్నారు. ఈ వార్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్‌ అయింది. వెంటవెంటనే వారిని గుర్తించే పనిలో పడింది. దొరికిన వారికి దొరికినట్లుగా టెస్టులు చేయిస్తోంది.

    Also Read: యూరప్ దేశాలను హడలెత్తిస్తున్న కొత్త కరోనా.. ఫ్రాన్స్ లో తొలి కేసు నమోదు..!

    అంతేకాదు.. నిన్న మీడియా ముందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌ మాట్లాడుతూ.. ఇది వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కొత్తరకం స్ట్రెయిన్‌పై ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు. కరోనా రెండో దశను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు యూకే నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి ఈటలకు తెలిపారు వైద్య శాఖాధికారులు.

    Also Read: సంచలనం.. కరోనాను జయించిన ‘ధారవి’..!

    తెలంగాణకు మొత్తం 1200 మంది ప్రయాణికులు రాగా..వారిలో 846 మందిని గుర్తించి టెస్టులు చేసినట్లు చెప్పారు. వీరిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. యూకే నుంచి వచ్చిన వారిలో ఏ రకం వైరస్ ఉందో తెలుసుకోవడానికి బ్లడ్ శాంపిల్స్‌ సీసీఎంబీ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. అంతేకాదు.. కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. క్రిస్మస్, నూతన సంవత్సర సంక్రాంతి వేడుకలకు ఇంటికే పరిమితమై జరుపుకోవాలని సూచించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన మాస్క్, భౌతిక దూరం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం మరిచిపోవద్దని కోరారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఇక.. కరోనా వ్యాక్సిన్ రాష్ట్రానికి రాగానే ప్రజలకు అందించేలా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి ఈటల. వ్యాక్సిన్ వేసేందుకు 10 వేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామని..ఒక్కొక్కరు రోజుకు వంద మందికి టీకా వేసినా పది లక్షల మందికి రోజుకి వ్యాక్సిన్ వేయగలమని అధికారులు తెలిపారు. మొదటి దశలో 70 నుంచి 80 లక్షల మందికి టీకా వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.