Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: రాజమండ్రి కి పవన్ - లెక్క సరిచేయనున్న పవర్ స్టార్

Pawan Kalyan: రాజమండ్రి కి పవన్ – లెక్క సరిచేయనున్న పవర్ స్టార్

Pawan Kalyan: ఏపీ సర్కారుపై మరో పోరాటానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యాన్నిప్రపంచానికి తెలియజెప్పేందుకు బృహుత్తర ప్రణాళికను సిద్ధం చేశారు. మూడున్నరేళ్లుగా వైసీపీ పాలకుల అవినీతిని బయటపెట్టేందుకు నిర్ణయించారు. జనసేన సోషల్ ఆడిట్ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. అందులో భాగంగా 12,13,14 తేదీల్లో రాజమండ్రితో పాటు గుంటూరులో పర్యటించనున్నారు. జగనన్న కాలనీ లేఅవుట్లు, ఇళ్ల నిర్మాణం, టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించనున్నారు. అయితే ప్రధాని మోదీతో విశాఖలో భేటీ అనంతరం కార్యక్రమం ప్రారంభం కానుండడంతో అధికార వైసీపీలో కలవరం ప్రారంభమైంది. 12వ తేదీన ఆయన తూర్పు గోదావరిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి జనసేన వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.

Pawan Kalyan
Pawan Kalyan

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగనన్న కాలనీ లేఅవుట్లను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ఇళ్ల పట్టాలను అందించింది. అటు గృహనిర్మాణం చేపడుతున్నట్టు ప్రకటించింది. అయితే ఈ వ్యవహారం వెనుక భారీ అవినీతి జరిగిందని పవన్ ఆరోపిస్తూ వచ్చారు. ‘జగనన్న ఇళ్లు.. పేదలకు కన్నీళ్లు’ అంటూ తాజాగా కామెంట్స్ చేశారు. అయితే ఈ ఆరోపణల వెనుక జనసేన కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఒక్క జగనన్న కాలనీ పథకంలో రూ.75 వేల కోట్ల అవినీతి జరిగినట్టు గుర్తించినట్టు సమాచారం. ఇప్పటివరకూ లేఅవుట్ల కోసం 23 వేల ఎకరాలను సేకరించారు. అయితే ఐదారు లక్షల రూపాయలకే దొరికే భూమికి పదింతలు అంటే రూ.50 లక్షలకు కొనుగోలు చేసినట్టు గుర్తించారు.అవి కూడా నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో.. ఊరికి దూరంగా సెంటు వేల రూపాయల్లో ఉండగా.. లక్షల రూపాయలు చెల్లించి మరీ భూములను సేకరించారు. ఇలా ప్రాథమికంగా భూ సేకరణలోనే రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూకనిపిస్తుండడంతో దీనినే అజెండాగా తీసుకొని పవన్ పోరాటానికి సద్ధమవుతున్నారు.

అయితే పవన్ తాజా పర్యటనతో వైసీపీలో కలవరం ప్రారంభమైంది. సాధారణ పర్యటనల్లో తన కామెంట్స్ తో పవన్ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. అదే ఒక ప్రత్యేక అజెండాతో ప్రభుత్వపాయల అవినీతి జరిగిందని జనసేన నుంచి వినిపిస్తున్న మాట. అందుకే నిజాశించిన స్థాయిలో లేదు. దీంతో లేఅవుట్లలో గృహ నిర్మాణం నిలిచిపోయింది. అటు ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం అవినీతి, నిర్లక్షాన్ని ప్రపంచానికి తెలియలు నిగ్గు తేల్చేందుకు పవన్ పర్యటించనున్నారు.

Pawan Kalyan
Pawan Kalyan

గత ప్రభుత్వ హయాంలో పట్టణ పేదల కోసం అత్యాధునిక టెక్నాలజీతో టిడ్కో ఇళ్లను నిర్మించారు. వీటిలో కొన్నింటి నిర్మాణం పూర్తికాగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఏపీలో అధికారం బదలాయింపు జరగగానే వీటి నిర్మాణం నిలిచిపోయింది. నిర్మాణం పూర్తయిన వాటిని లబ్ధిదారులకు అప్పగించలేదు. వీటిని అచేతనంగా వదిలేయడంతో ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వృథాగా ఉండిపోయాయి. మరోవైపు జగనన్న కాలనీ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. కనీసం మెటీరియల్ తీసుకుని వెళ్లేందుకు లేఅవుట్లలో సరైన రోడ్డు సదుపాయం లేదు. మూడు విధానాల్లో ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం తరువాత మడతపెచీ వేసింది. లబ్ధిదారులే నిర్మాణాలు జరుపుకోవాలని సూచించింది. అయితే బిల్లుల చెల్లింపు కూడా ఆజెప్పాలని నిర్ణయించడంతో ఎటువంటి కామెంట్స్ వస్తాయో అని అధికార పార్టీ నాయకులు భయపడిపోతున్నారు. రేపటి నుంచిమూడు రోజుల పాటు కార్యక్రమ నిర్వహణ ఉంటుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని పర్యటన తరువాత పవన్ తాజా పర్యటన మరింత హీట్ పెంచే పరిస్థితులైతే మాత్రం కనిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular