Mahesh Babu- Rajamouli Movie: బాహుబలి సిరీస్ మరియు #RRR తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఎనలేని గుర్తింపుని క్రేజ్ ని దక్కించుకున్న దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఎప్పుడో పదేళ్ల క్రితమే ఖరారైన ఈ క్రేజీ కాంబినేషన్ కార్య రూపం దాల్చడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది..ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్న రాజమౌళి ఈ ఏడాది లోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు కాస్టింగ్ సెలక్షన్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తునట్టు సమాచారం.

ఇప్పటి వరుకు యాక్షన్ చిత్రాలు, జానపద చిత్రాలు తీసిన రాజమౌళి ఈ సినిమా ద్వారా ‘గ్లోబల్ త్రోటాల్’ అడ్వెంచర్ జానర్ ని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి పరిచయం చెయ్యబోతున్నాడు..#RRR మూవీ తో పాన్ వరల్డ్ రేంజ్ రీచ్ ని దక్కించుకున్న రాజమౌళి ఈ సినిమాని పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కించబోతున్నాడు.
అయితే ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ లెంగ్త్ చాలా పెరిగిపోయిందట..కచ్చితంగా రెండు భాగాలుగా ఈ స్క్రిప్ట్ ని బాహుబలి తరహాలో విభజించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రస్తుతం సీక్వెల్స్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బాహుబలి 2 మరియు కేజీఎఫ్ 2 చిత్రాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వేల కోట్లు వసూళ్లను రాబట్టి టాప్ 2 చిత్రాలుగా నిలిచాయి..అందుకే ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా విభజించి తియ్యడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తునట్టు సమాచారం..మరి మహేష్ బాబు అన్ని రోజులు డేట్స్ ఇస్తాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకొని రెండవ షెడ్యూల్ ని ప్రారంభించుకోవడానికి సిద్ధం గా ఉంది..మార్చి లోపు ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి రాజమౌళి సినిమాకి షిఫ్ట్ అయిపోవాలని మహేష్ బాబు చూస్తున్నాడు.