Pawan Kalyan: జనసేన పోరు మొదలుపెట్టింది. అధికార పార్టీ వైసీపీ తీరుతో విసిగిపోయిన జనసేన తనదైన శైలిలో యుద్ధం ప్రారంభించింది. గతంలోనే ఆంధ్రలో రోడ్ల దుస్థితిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా ప్రభుత్వంలో చలనం రాలేదు. దీంతో సొంత ఖర్చులతో రోడ్లను బాగు చేసిన ప్రభుత్వం స్పందించలేదు. ఏపీలో పరిస్థితిపై జనసేన కసరత్తు షురూ చేసింది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు పోరాటం ఆరంభించింది. వైసీపీని అడ్డుకోవాలని అన్ని దారులు వెతుకుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉండగానే పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమాల్లో యుద్ధం మొదలు పెట్టారు. జగనన్న ఇళ్లు.. పేదలందరికి కన్నీళ్లు అంటూ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సీఎం జగన్ తీరుతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పేదల ప్రభుత్వమని చెప్పుకుంటూనే వారికి ఎలాంటి లాభాలు చేకూర్చకుండా స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పవన్ కల్యాణ్ దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. ఏపీలో పరిస్థితిపై వీరి మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. జగన్ చేస్తున్న విమర్శలకు జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ జత చేస్తున్నారు. జగన్ తీరుపై మండిపడుతున్నారు. అధికారం కోసం అడ్డదారుల్లో వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే ఎదురుగా నిలిచి పోరాడాలి కానీ దొంగదెబ్బలు తీయడం జగన్ కు అలవాటుగా మారింది.

జనసేన ఏపీలో పాగా వేయాలని చూస్తోంది. వైసీపీని నిలువరించి ప్రజల పక్షాన నిలవాలని ఆశిస్తోంది. ఓ వైపు జగన్ విశాఖ లో జరిగిన ప్రధాని సభలో ఉండగానే పవన్ కల్యాణ్ తన యుద్ధం కొనసాగించడం విశేషం. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారనున్నాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతకీ పొత్తుల విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఏ పార్టీ దేనితో జత కడుతుందో తెలియడం లేదు. మొత్తానికి రాష్ర్టంలో పొత్తుల పరంపర మాత్రం కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.