సామాజిక న్యాయం, సమసమాజ స్థాపన, రాజకీయ ప్రక్షాళన ఇవి జనసేన పార్టీ అజెండాలోని కొన్ని అంశాలు. చెప్పుకున్న సిద్ధాంతాలు విలువలు ఒక్కొక్కటి గాలికి వదిలేస్తూ వస్తున్నాడు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల ముందు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆదిలోనే హంసపాదన్న తీరున, గతంలో అవినీతి పరుడన్న బాబుని..అనుభవజ్ఞుడు కనుక ఆయనకే నా సపోర్ట్ అని టీడీపీ, బీజీపీ కూటమిలో చేరారు. జనసేన చెప్పుకునే రాజకీయ ప్రక్షాళన అనే అంశం దీనితో ఆయన తుంగలో తొక్కినట్లయ్యింది. ప్రజల్లో జనసేన పార్టీ ఒక ఆశాకిరణం అనే ఆలోచన తొలగించిన అంశం మొదట్లోనే టీడీపీ, బీజేపీకి మద్దతు ఇవ్వడం. అందరూ అవినీతి పరులే అనే పార్టీ పెట్టిన పవన్ వారితో ఎలా చేతులు కలుపుతాడు అనేది ప్రజల మనస్సులోకి చేరింది.
ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్
2019 ఎన్నికలకు సరిగ్గా ఏడాదికి ముందు బీజేపీని, ప్రధాని మోడీని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేశారని సభలపై పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు. కొంత కాలానికి టీడీపీ ని కూడా విభేదించిన బయటకు రావడం, సోలోగా ఎన్నికల బరిలో దిగడం జరిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఘోర పరాజయం తరువాత పట్టుమని పదినెలలకు కూడా గడవక ముందే పవన్ సహచర్యం, తోడులేకుండా రాజకీయాలు చేయలేకపోయాడు. తిట్టిన మోడీనే భేష్ అంటూ..మోడీకి మిత్రుడుగా.. ప్రాధాన్యం లేని బీజేపీ సహచర పార్టీగా మిగిలిపోయాడు.
బీజేపీతో చేరిన తరువాత ఆయన మాట తీరు సిద్ధాంతాలు కూడా మారిపోయాయి. హిందూత్వ పార్టీగా పేరున్న బీజేపీలో చేరిన పవన్ సామాజిక న్యాయం, సమసమాజం అనే అంశాలను వదిలేసినట్టే. కాగా నిన్న ఆయన ఏకంగా చాతుర్మాస్య దీక్ష తీసుకున్నారు. దీనిలో భాగంగా నాలుగు నెలలు కఠిన నియమాలు పాటించనున్నారు. బ్రహ్మ చర్యం, ఒంటి పూట భోజనం, నదీస్నానం, నేలపై పడక వంటి నియమాలతో పాటు.. కోపం, ద్వేషం, ఇతరులను నిందించకుండా ఉండడం వంటి కఠిన నియమాలు పాటించాలి.
కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్ వ్యూహమేంటి?
రాజకీయ నాయకుడిగా ఉంటూ ఇతరులను ద్వేషించకుండా ఉండడం సాధ్యమేనా. మరి ఈ నాలుగు నెలలు జగన్ తిట్టే కార్యక్రమం సంగతి ఏమవుతుంది. జగన్ పేరు చెబితే ఊగిపోయే పవన్… కోపం, ద్వేషం అనే ఫీలింగ్స్ కి ఈ నాలుగు నెలలు ఫుల్ స్టాప్ పెడతాడా. కాగా దీక్ష నియమాలలో అబద్దాలు ఆడకూడదనే నియమం కూడా ఉంది. మనసులో మంచిపని అని తెలిసినా, మైకుల ముందు సీఎం ని విమర్శించడం ప్రత్యర్థి పార్టీగా ఆయన లక్ష్యం. మరి ఈ నాలుగు నెలలు మంచిని మంచిగా.. చెడుని చెడుగా…పవన్ విభజించి మాట్లాడుతారా. కోపం ద్వేషం వదిలేస్తే ఆయన దీక్ష కాలంలో జగన్ ఎలా తిట్టడగలడు చెప్పండి. మరి ఈ దీక్షలో పవన్ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.