కొత్త సచివాలయ భవన నిర్మాణానికి రంగం సిద్ధం?

పాత సచివాలయ భవననాలను కూల్చివేసి దాని స్థానంలో కొత్త భవన నిర్మాణానికి రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి అన్ని రకాల అడ్డంకులు తొలిగిపోవడంతో… ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయిచింది. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరులోగా భవనాలన్నింటినీ నేలమట్టం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. శ్రావణ మాసంలో టెండర్లు నిర్వహించి కొత్త భవన సముదాయం నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. హైకోర్టు తీర్పు వచ్చిన రోజే డీ–బ్లాక్‌ లోని ఐటీ […]

Written By: Neelambaram, Updated On : July 2, 2020 11:25 am
Follow us on


పాత సచివాలయ భవననాలను కూల్చివేసి దాని స్థానంలో కొత్త భవన నిర్మాణానికి రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి అన్ని రకాల అడ్డంకులు తొలిగిపోవడంతో… ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయిచింది. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరులోగా భవనాలన్నింటినీ నేలమట్టం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. శ్రావణ మాసంలో టెండర్లు నిర్వహించి కొత్త భవన సముదాయం నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. హైకోర్టు తీర్పు వచ్చిన రోజే డీ–బ్లాక్‌ లోని ఐటీ శాఖ సర్వర్‌ ను ప్రభుత్వం బీఆర్‌ కేఆర్‌ భవన్‌ కు తరలించడంతో పాటు మీడియా పాయింట్‌ ను సైతం ఖాళీ చేయించి సచివాలయ ప్రధాన ప్రవేశ ద్వారం గేట్లకు తాళాలు వేయించారు. ఏళ్ల తరబడిగా సచివాలయంలో నిరుపయోగంగా ఉన్న వాహనాల తరలింపును సైతం నిన్నటి నుంచి ప్రారంభించింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు నిరుపయోగంగా ఉన్న వాహనాలను క్రేన్ల సహాయంతో సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిజాం కళాశాల మైదానానికి తరలించారు. వందకు పైగా కార్లు, జీపులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వీటిలో ఉన్నాయి. రవాణాశాఖ పరిశీలించి ధరలను ఖరారు చేశాక… బహిరంగ వేలం ద్వారా వీటిని విక్రయించే అవకాశముంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలను కొనుగోలు చేయడంతో చాలా మంది అధికారులు తమ పాత వాహనాలను సచివాలయంలో నిరుపయోగంగా ఉంచారు. వీటిలో పనికి వచ్చే వాహనాలను గుర్తించి వేలం వేయనున్నట్టు తెలుస్తోంది.