చైనాకు ఆర్థికంగా మరో షాక్ ఇచ్చిన భారత్?

భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గాల్వానాలోయలో భారత జవాన్లను చైనా దొంగదెబ్బ తీసింది. ఈ ఘటనలో 21మంది భారత జవాన్లు వీరమరణం పొందగా చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు సమాచారం. చైనా తమ సైనికులు ఎంతమంది చనిపోయారనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ ఘర్షణలో చైనాను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో ఆ దేశానికి భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే భారత జవాన్లను దొంగదెబ్బ […]

Written By: Neelambaram, Updated On : July 1, 2020 8:19 pm
Follow us on


భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గాల్వానాలోయలో భారత జవాన్లను చైనా దొంగదెబ్బ తీసింది. ఈ ఘటనలో 21మంది భారత జవాన్లు వీరమరణం పొందగా చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు సమాచారం. చైనా తమ సైనికులు ఎంతమంది చనిపోయారనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ ఘర్షణలో చైనాను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో ఆ దేశానికి భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే భారత జవాన్లను దొంగదెబ్బ తీయడంపై యావత్ భారత్ తోపాటు కేంద్రం కూడా సీరియస్ అయింది. చైనాతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది.

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

అమర జవాన్ల మరణం ఊరికేపోదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీ సైతం స్పష్టం చేశారు. సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పించారు. అంతేకాకుండా త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. ఈమేరకు త్రివిధ దళాలు అలర్ట్ అయ్యారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే యుద్ధరంగంలో దిగేందుకు సన్నద్ధంగా ఉన్నాయి. ఈ ఘర్షణ అనంతరం ఇరుదేశాల మధ్య ఇప్పటివరకు మూడుసార్లు ఆర్మీ, దౌత్య స్థాయి అధికారుల సమావేశాలు జరిగాయి. ఈ మూడుసార్లు కూడా చర్చలు అర్ధాంతంగా ముగినట్లు తెలుస్తోంది.

సరిహద్దుల్లో చైనా వెనక్కి వెళుతున్నట్లు చెబుతూనే సరిహద్దుల్లో తన సైన్యాన్ని మోహరిస్తోంది. దీంతో భారత్ కూడా చైనాను సమర్ధంతంగా తిప్పికొడుతోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమనేనని భారత ఆర్మీ కేంద్రానికి తెలిపింది. అయితే చైనాకు భారత్ సరైన గుణపాఠం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. చైనాను ఒక రక్షణపరంగానే కాకుండా ఆర్థికంగా, దౌత్యపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. దేశంలో చైనా వస్తువుల బహిష్కరించాలని డిమాండ్ వస్తున్న తరుణంలోనే కేంద్రం తాజాగా చైనాకు చెందిన 59యాప్స్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. వీటికి ముందుగానే చైనాకు చెందిన పలు కాంట్రాక్టులను కేంద్రం రద్దుచేసి చైనాకు గట్టి షాకిచ్చింది.

వావ్.. కరోనాకు ఫేర్ వెల్ పార్టీ.. వైరల్ వీడియో

తాజాగా కేంద్రం చైనాకు మరో షాకిచ్చింది. హైవే ప్రాజెక్టుల్లో చైనా సంస్థలు, చైనాతో భాగస్వామ్యం ఉన్న సంస్థలకు అనుమతి ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం తెలిపారు. వీటికి సంబంధించిన విధి విధానాలు త్వరలో రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వివిధ రంగాల్లోనూ చైనా పెట్టుబడిదారులను ప్రోత్సహించకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మరోవైపు టెలికాం రంగంలో చైనాకు చెందిన 5జీ సేవలను నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయాల ద్వారా చైనాకు ఆర్థికంగా గట్టి ఎదురుదెబ్బ పడునుంది. దీంతో చైనా కంపెనీలు కలవరానికి గురవుతున్నాయి. రానున్న రోజుల్లో చైనాకు మరిన్ని షాకులు ఇచ్చేందుకు మోడీ సర్కార్ ఈమేరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. మున్మందు చైనాకు చుక్కలు చూపించడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి..