Pawan Kalyan: ఏపీలో చాలా విచిత్రమైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో పవన్ దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దీక్ష చేస్తానని చెప్పినప్పటి నుంచే వైసీపీ నేతలు పవన్‌ను టార్గెట్ చేశారు. పవన్ కు దమ్ముంటే మోడీని నిలదీయాలని, కేంద్రం ప్రయివేటీకరిస్తుంటే తమను నిందించడం ఏంటని ప్రశ్నించారు. అయితే ఒక్క ఎంపీ కూడా లేని జనసేన పార్టీ ప్రశ్నిస్తే.. మరి 22మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఏం చేస్తోందనే అనుమానాలు వస్తున్నాయి.

అధికారంలో ఉన్న పార్టీ, పైగా మొన్న జరిగిన గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరించకుండా చూస్తామని ఇదే హామీని బలంగా వినిపించి అధికారంలోకి వచ్చిన పార్టీ వైసీపీ. మరి ఇచ్చిన హామీని అమలు చేయకుండా.. పవన్‌ను నిందించడమే అందరినీ షాక్ కు గురి చేస్తోంది. పైగా స్టీల్ ప్లాంట్ విశాఖలో ఉంటే.. అమరావతిలో పవన్ దీక్ష చేయడమేంటని అడుగుతున్నారు. పవన్ మోడీకి భయపడే బీజేపీని ప్రశ్నించట్లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కానీ పార్లమెంట్ సమావేశాల్లో మాత్రం వైసీపీ ఎంపీలు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రైవేటీకరణ మీద ప్రశ్నించట్లేదు. ఎలాంటి నిరసన తెలపట్లేదు. పార్లమెంటులోనే నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ ఎంపీలే నోరు మెదపకుండా ఉంటే.. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ కూడా లేని పవన్ మోడీని నిలదీస్తే పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదన్న విషయం వైసీపీ నేతలు మర్చిపోతున్నారు. ఒకవేళ వైసీపీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ.. తమ శక్తిచాలట్లేదని ప్రతిపక్షాలను ఆహ్వానిస్తే అప్పుడు వారు రాకపోతే అడగాలి.
Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం పార్టీలకు తలనొప్పిగా మారనుందా?
అంతే గానీ ఏపీలో అధికారంలో ఉండి, సరిపోయేంత మెజార్టీ ఉన్న వైసీపీ మౌనంగా ఉంటూ పవన్‌ను ప్రశ్నించాలంటూ సలహాలు ఇవ్వడమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వైసీపీ ఇతర కారణాలతో కేంద్రాన్ని నిలదీయకుండా ప్రతిపక్షాలు నిలదీయాలని చెప్పడమే విడ్డూరంగా ఉంది. ఏమన్నా అడిగితే.. కేంద్రంలో మోడీ ప్రభుత్వంకు పూర్తి మెజార్టీ ఉందని, తాము ఏం చేయలేమని చేతులెత్తోస్తోంది వైసీపీ పార్టీ. ఎంత మెజార్టీ ఉంటే ఏంటి.. మీరు గట్టిగా ప్రయత్నిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం కదా అని ప్రతిపక్షాలు బలంగానే అడుగుతున్నాయి.
Also Read: AP Politics: హత్యారోపణల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు..!