https://oktelugu.com/

Radhe Shyam: ప్రభాస్ “రాధే శ్యామ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్…

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న తాజా మూవీ రాధే శ్యాం. పాన్ ఇండియా మూవీ గా తెర‌కెక్కిన ఈ సినిమాకు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 06:28 PM IST
    Follow us on

    Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న తాజా మూవీ రాధే శ్యాం. పాన్ ఇండియా మూవీ గా తెర‌కెక్కిన ఈ సినిమాకు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది.

    ఈ సినిమా నుంచి మూడో సింగిల్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. సంచారీ అంటూ సాగే సాంగ్ టీజ‌ర్ ను రేపు మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లు మూవీ యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మంచుకొండల్లో ప్రభాస్ ప్ర‌భాస్ స్కేటింగ్ పై ఉన్న పోస్ట‌ర్ ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ అప్ డేట్ తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఇప్పటి వరకు తెలుగు సంబంధించి… ‘ఈ రాతలే దోబూచులే’, ‘నగుమోము తారలే’ అనే రెండు పాటలను మాత్రమే రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలు కూడా టాప్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం… కృష్ణకాంత్ అందించిన సాహిత్యంతో పాటలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ మూడవ సాంగ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు ‘అనిరుధ్ రవిచందర్’ పడడం విశేషం. జనవరి 14న రాధే శ్యామ్ థియేటర్లలో రిలీజ్ కానుంది.