Virat kohli vs Rohit sharma: ప్రపంచకప్ టీ20లో టీమిండియా దారుణ పరాభవం తర్వాత టీ20 కెప్టెన్ పదవిని మాత్రమే విరాట్ కోహ్లీ వదులుకున్నారు. కానీ బీసీసీఐ మాత్రం అతడి నుంచి బలవంతంగా వన్డే పగ్గాలు లాగేసి రోహిత్ శర్మకు అప్పగించింది. వన్డే , టెస్టులకు కెప్టెన్ గా కోహ్లీ ఉంటానంటున్న బీసీసీఐ మాత్రం పరిమిత ఓవర్లకు రోహిత్ నే ఉన్నఫళంగా చేసేసింది. దీంతో టీమిండియాలో లుకలుకలు మొదలయ్యాయని.. విరాట్ అలిగాడని ప్రచారం సాగుతోంది.
అయితే భారత్ కు ఎన్నో విజయాలు అందించిన విరాట్ కోహ్లీని బీసీసీఐ కెప్టెన్సీ నుంచి తొలగించడం అన్యాయం అని భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్ గా రోహిత్ శర్మకు ఉన్న రికార్డు ఆధారంగానే అతడికి బాధ్యతలు అప్పగించామని తెలిపాడు.
Also Read: ‘డేవిడ్’ కోసం భారీ స్కెచ్ వేసిన ఆర్సీబీ..!
ఐపీఎల్ లో రోహిత్ శర్మకు గొప్ప రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్ జట్టును ఐదు సార్లు చాంపియన్ గా నిలబెట్టాడు. టీమిండియా కెప్టెన్ గానూ చాలా విజయాలు అందించాడు. రోహిత్ కెప్టెన్సీలోనే భారత జట్టు ఆసియాకప్ గెలిచింది. రోహిత్ కెప్టెన్సీ సామర్థ్యాలు అంచనా వేశారు కాబట్టే టీమిండియా కెప్టెన్ గా అతడిని నియమించినట్టు గంగూలీ తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా ఘోర పరాజయం తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్ గా తప్పుకుంటున్నట్టు కోహ్లీ ప్రకటించాడు. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ను టీమిండియా ఏకంగా 3-0తో గెలిచింది. ఈ క్రమంలోనే వన్డే పగ్గాలు కూడా రోహిత్ కే అప్పగించేసింది బీసీసీఐ. కోహ్లీని వైదొలగాలని సెలెక్టర్లు, బీసీసీఐ ఎప్పుడూ కోరలేదు.కానీ కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పాడు. దీంతో టీ20, వన్డేలకు వేర్వేరు కెప్టెన్లు ఉండొద్దనే రోహిత్ శర్మకే బాధ్యతలు అప్పగించారు.
Also Read: దక్షిణాఫ్రికా పర్యటనకు రోహిత్ శర్మ దూరమేనా?