https://oktelugu.com/

Pawan Kalyan Sensational Statement: ఏపీ రాజకీయాలు శాసిస్తాం.. పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన

Pawan Kalyan Sensational Statement: ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోసం జనసేన పార్టీ అడుగులు వేస్తోంది. ఇకమీదట ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల కష్టాలన పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ప్రయత్నించింది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ ఈ మేరకు ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను ప్రభుత్వంపై పోరాటం చేయాలని బావించారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించే పార్టీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2022 / 05:25 PM IST
    Follow us on

    Pawan Kalyan Sensational Statement: ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోసం జనసేన పార్టీ అడుగులు వేస్తోంది. ఇకమీదట ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల కష్టాలన పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ప్రయత్నించింది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ ఈ మేరకు ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను ప్రభుత్వంపై పోరాటం చేయాలని బావించారు.

    Pawan Kalyan Sensational Statement

    ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభలో ఇంకా అనేక విషయాలపై స్పష్టత ఇవ్వనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు. ఏపీలో రాజకీయాలు శాసిస్తామని పవన్ కల్యాణ్ ధీమాగా చెబుతున్నారు. అధికార పార్టీకి ఇక కాలం ముగిసినట్లేనని పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో తమదే విజయం అని పార్టీ నేతలకు భరోసా కల్పిస్తున్నారు.

    Also Read: ఆ హీరోయిన్ పై ఎన్టీఆర్ ప్రత్యేక ఇంట్రెస్ట్

    గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు మూడు లక్షలకు పైగా కార్యకర్తలు హాజరవుతారని తెలుస్తోంది. సభా వేదికకు దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. దీంతో పవన్ కల్యాణ్ ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. కానీ కార్యకర్తల్లో జోష్ నింపి వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడం మాత్రం వాస్తవమే అని తేల్చేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

    సభలో పవన్ కల్యాణ్ అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు భావిస్తున్నారు. ఇన్నాళ్లుగా వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జనసేన కార్యకర్తలకు మనోనిబ్బరం పెంచే విధంగా పవన్ పక్కా ప్రణాళిక రూపొందించినట్లు చెబుతున్నారు. సభ నిర్వహణకు పోలీసులు అడ్డంకులు కల్పిస్తే ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా సభ నిర్వహించి తీరుతామని వెల్లడిస్తున్నారు.

    Pawan Kalyan Sensational Statement

    ప్రజల అంచనాలకు అనుగుణంగానే పార్టీని గాడిలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్ లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి సభలో వెల్లడించనున్నారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే విధంగా పార్టీ నిర్ణయాలు ఉండబోతున్నాయని చెబుతున్నారు. వచ్చే రెండేళ్లలో పార్టీని ముందుకు నడిపించేందుకు కావాల్సిన మార్గనిర్దేశకాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

    Also Read: హీరో విశాల్ కుటుంబంతో చిరంజీవికి ఉన్న ప్రత్యేక అనుబంధం ఇదే..

    Tags