Bheemla Nayak Box Office Collection: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయి 15 రోజులు అవుతున్నా.. కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమా నిరూపించింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే.. ఈ చిత్రం 15 రోజుల కలెక్షన్స్ ను ఏరియాల వారీగా చూస్తే ఇలా ఉన్నాయి.
నైజాం : 31.04 కోట్లు,
సీడెడ్ : 10.83 కోట్లు,
ఉత్తరాంధ్ర: 7.35 కోట్లు,
Also Read: ఆ హీరోయిన్ పై ఎన్టీఆర్ ప్రత్యేక ఇంట్రెస్ట్
ఈస్ట్: 5.43 కోట్లు,
వెస్ట్: 5.03 కోట్లు,
గుంటూరు: 5.12 కోట్లు,
కృష్ణా: 3.77 కోట్లు,
నెల్లూరు: 2.44 కోట్లు,
ఏపీ & తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ టోటల్ సెకండ్ డే కలెక్షన్స్ – 71.01 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.33 కోట్లు,
ఓవర్సీస్ 12.37 కోట్లు,
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 90.71 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
అన్నట్టు ‘భీమ్లా నాయక్’ సినిమాకి మొత్తం రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండో వారంలోనే పూర్తి లాభాల్లోకి వెళ్లిపోయింది. ఇక మూడో వీకెండ్ లోనూ ‘భీమ్లా నాయక్’ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. గత మూడేళ్లుగా పవన్ అభిమానులు ఇలాంటి భారీ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ‘భీమ్లా నాయక్’ అదిరిపోయే ఫుల్ మాస్ ట్రీట్ ను ఇచ్చాడు.
Also Read: ఇక్కడ ‘ప్లాప్ హీరోయిన్’.. అక్కడ సూపర్ హిట్ అయ్యేలా ఉంది