Nandamuri Balakrishna Movie On yvs Chowdary: నటసింహం బాలయ్య బాబు వ్యక్తిత్వం చాలా విభిన్నమైనది. అలాగే బాలయ్యలోని సేవాగుణం కూడా చాలా ప్రత్యేకమైనది. అవసరంలో ఉన్నవారికి అడగకుండానే సాయం చేసే బాలయ్య, ఇక తన మనుషులు అని అనుకున్నవాళ్లకు ఎంత అయినా చేస్తాడు. పైగా బాలయ్యకి ఒక్కసారి కనెక్ట్ అయితే ఇక వారిని సొంత మనుషుల్లా చూసుకుంటారని, వారితో మళ్ళీ విడిపోవడం దాదాపు అసాధ్యమని బాలయ్య గురించి తెలిసిన వాళ్ళు చెబుతుంటారు.
అది నిజమే అని మరోసారి రుజువు అయింది. అఖండ చిత్రం సాధించిన అఖండమైన విజయం తర్వాత తనతో సినిమా చేయడానికి చాలామంది స్టార్ దర్శకులు రెడీగా ఉన్నా, బాలయ్య మాత్రం ఒక ప్లాప్ డైరెక్టర్ కి సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సినిమా ఇస్తోంది ఎదో గొప్ప కథ దొరికింది అని కాదు. ఆ ప్లాప్ డైరెక్టర్ తనను నమ్ముకున్న మనిషి అని. ఇదేంటి ? ఇలా కూడా సినిమా ఛాన్స్ లు ఇస్తారా ? అంటే.. బాలయ్య మాత్రమే ఇస్తాడు.
Also Read: హీరో విశాల్ కుటుంబంతో చిరంజీవికి ఉన్న ప్రత్యేక అనుబంధం ఇదే..
పైగా పిలిచి మరీ సినిమా ఇస్తాడు. ఇప్పుడు అలాగే ఇచ్చాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు..? వై. వి. ఎస్. చౌదరి. దర్శకుడిగా వై. వి. ఎస్. చౌదరికి బాలయ్య గతంలో ఒక సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ ఫలితంగా వచ్చిన సినిమానే ‘ఒక్క మగాడు’. బాలయ్య సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రంగా నిలిచింది ఈ సినిమా. దీనికితోడు వై. వి. ఎస్. చౌదరి గత కొన్నేళ్ళుగా తీసిన సినిమాలన్నీ భారీ ఫ్లాప్ బడ్జెట్ సినిమాలే.
అన్నిటికీ మించి వై. వి. ఎస్. చౌదరి సినిమా తీసి ఇప్పటికే దాదాపు ఏడు సంవత్సరాలు అయిపోయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి డైరెక్టర్ కి నిజంగా ఏ స్టార్ హీరో పిలిచి సినిమా ఇస్తాడు ? కానీ బాలయ్య ఇచ్చాడు. కథ లేకపోయినా.. కేవలం తన మనిషి అనే ఒకే ఒక్క కోణంలో ఆలోచించి భారీ బడ్జెట్ సినిమా ఇచ్చాడు బాలయ్య.
నిజానికి వై. వి. ఎస్. చౌదరికి హిట్ లేకపోవడంతో చిన్న హీరోలు కూడా ఎవ్వరూ అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. కానీ బాలయ్య మాత్రం వై. వి. ఎస్. చౌదరికి ఛాన్స్ ఇచ్చి.. అతని జీవితాన్ని నిలబెట్టడానికి సన్నద్ధం అవుతున్నాడు. మరి చూడాలి వై. వి. ఎస్. చౌదరి ఈ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో. అయితే, ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. బాలయ్యకు కథ నచ్చాలి. నచ్చే కథను వై. వి. ఎస్. చౌదరి చేయగలడా ? అందుకే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే వరకు నమ్మకం లేదు అంటున్నారు సినీ జనం.
Also Read: బిగ్‌బాస్ నుంచి రెండో వారం ఎలిమినేట్ అయ్యేది అమెనేనా..?