https://oktelugu.com/

Pawan Kalyan: ‘బ్రో ‘ వివాదం పై స్పందించిన పవన్ కళ్యాణ్

గత కొద్దిరోజులుగా ఈ చిత్రంపై రచ్చ కొనసాగుతూనే ఉంది.మంత్రి రాంబాబు రెండుసార్లు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారు.బ్రో సినిమా కలెక్షన్లు కూడా వివరించారు.ఈ చిత్రం టిడిపి స్పాన్సర్షిప్ తో నిర్మించినదని చెప్పుకొచ్చారు.

Written By: , Updated On : August 4, 2023 / 06:00 PM IST
Pawan Kalyan

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: బ్రో సినిమాపై రంకెలు వేస్తున్న వారికి పవన్ దీటైన సమాధానం ఇచ్చారు. గత కొద్ది రోజులుగా బ్రో సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్,సాయి ధరంతేజ్ కాంబినేషన్లో విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్లను కొల్లగొడుతుంది. అయితే ఈ సినిమాలో శ్యామ్ బాబు క్యారెక్టర్ పై వివాదం నెలకొంది. అది తనను ఉద్దేశించి పెట్టిన క్యారెక్టర్ అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు చిత్రం యూనిట్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

గత కొద్దిరోజులుగా ఈ చిత్రంపై రచ్చ కొనసాగుతూనే ఉంది.మంత్రి రాంబాబు రెండుసార్లు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారు.బ్రో సినిమా కలెక్షన్లు కూడా వివరించారు.ఈ చిత్రం టిడిపి స్పాన్సర్షిప్ తో నిర్మించినదని చెప్పుకొచ్చారు. టిడిపి నుంచి ప్యాకేజీ అందుకున్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటించారని ఆరోపణలు చేశారు. ఏకంగా తెలుగు సినీ పరిశ్రమను హెచ్చరించారు. ఓసారి ఇది రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఢిల్లీ వెళ్లి ఈడికి ఫిర్యాదు చేయనున్నట్లు హడావిడి చేశారు.

మరోవైపు పవన్ పై ఇటువంటి చిత్రాలను తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు అంబటి ప్రకటించారు. ఇందుకుగాను తాళి, ఎగతాళి, మూడు పెళ్లిళ్లు వంటి సినిమా పేర్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి జన సైనికులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.తిరుపతిలో అయితే ఏకంగా సందులో సంబరాల శ్యాంబాబు పేరిట ఒక సినిమాను ప్రారంభించారు.రాష్ట్రవ్యాప్తంగా అంబటి పై జనసైనికులు వ్యంగ్యాస్త్రాలతో విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళిన అంబటి రాంబాబు మడత పేచీ వేశారు. తాను నిర్వర్తిస్తున్న మంత్రిత్వ శాఖ పై దృష్టి పెట్టకుండా.. ఇలా సినిమా టిక్స్ ఏమిటన్న విమర్శలు ఆయనపై వ్యక్తం అయ్యాయి. దీంతో ఢిల్లీ వెళ్లి తోక జాడించిన ఆయన సాగునీటి శాఖ పై అధికారులను కలిసి చేతులు దులుపుకున్నారు.

మరోవైపు బ్రో వివాదంపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజకీయాల్లోకి సినిమాను తీసుకురాకండి అని సూచించారు. పార్టీని నడిపేందుకు నాకు సినిమాలు ఇంధనమని చెప్పుకొచ్చారు. ఇష్యూను డైవర్ట్ చేసేందుకే వైసీపీ నేతలు అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నేనే ఆ సినిమా చేసి వదిలేసాను.. మీరెందుకు పట్టుకు లాగుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఎంతటితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండి అంటూ సూచించారు. ఇకపై ఆ సినిమాలు పై మాట్లాడొద్దంటూ పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. అయితే పవన్ ఊరుకున్నా వైసీపీ నేతలు ఊరుకుంటారో లేదో చూడాలి మరి.