spot_img
Homeఎంటర్టైన్మెంట్Kangana Ranaut: ఆ స్టార్ హీరో తన భార్య ఉన్నా కానీ నన్ను కోరుకునేవాడు: ప్రభాస్...

Kangana Ranaut: ఆ స్టార్ హీరో తన భార్య ఉన్నా కానీ నన్ను కోరుకునేవాడు: ప్రభాస్ హీరోయిన్

Kangana Ranaut: ప్రభాస్ హీరోగా చేసిన ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌట్. ఆ తరువాత పెద్దగా తెలుగు సినిమాలలో కనిపించకపోయినా హిందీలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ అమ్మడు. ఇక ఈమధ్యనే జయలలిత బయోపిక్ తలైవి సినిమాతో మరోసారి సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం లారెన్స్ చంద్రముఖి 2 సినిమా అలానే ఎమర్జెన్సీ సినిమాలతో బిజీగా ఉండి కంగనా.

కంగనా సినిమాలతో కాకుండా ఎక్కువ వివాదాలతో కూడా వార్తల్లో ఎప్పుడూ నిలుస్తూ ఉంటుంది అనే సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా తన ఇంస్టాగ్రామ్ పోస్టులు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది పేరు పెట్టకుండా తాను చెప్పాల్సింది అంతా చెప్పేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో జరుగుతున్న ఎన్నో విషయాలను కొంచెం కూడా భయం లేకుండా మీడియా ముందు పెట్టిన వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక స్టార్ హీరో గురించి కంగనా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో గురించి చెబుతూ.. ‘సూపర్ స్టార్, స్త్రీ లోలుడిగా తెలిసిన వ్యక్తి.. నా ఇంటికి వచ్చేవాడు. డేట్ చేయమంటూ ఆదుకునేవాడు. ప్రాధేయపడేవాడు. రహస్యంగా నన్ను వెంబడించేవాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్ అని అడిగితే.. డాడీ లిటిల్ ప్రిన్సెస్ ని తాను లవ్ చేయడం లేదని అన్నాడని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ లిటిల్ ప్రిన్సెస్ తో కలిసి జీవించడం ఇష్టం లేదని.. ఈ విషయం ఆమెకు చెప్పలేనని.. నువ్వు ఒప్పుకుంటే సీక్రెట్ గా కలిసి జీవిద్దం’ అని ఆ సూపర్ స్టార్ చెప్పినట్లు ఆమె రాసుకొచ్చింది. అయితే ఈ మాటలు అన్నీ విన్నవారు ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు రణబీర్ కపూర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

రణబీర్ పెళ్లి ఒక నాటకమని ఆమె గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రణబీర్ ని ఉద్దేశించే పోస్ట్ పెట్టిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ పోస్టులో ఉన్న లిటిల్ ప్రిన్సెస్ రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ అని కూడా తెగ కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియా యూజర్స్.

ఇక అక్కడితో ఆగకుండా మరికొన్ని విషయాలు షేర్ చేస్తూ కంగనా.. ‘ఎన్ని సార్లు నంబర్ బ్లాక్ చేసినా వేరే నంబర్ల నుంచి కాల్ చేసేవాడని.. ఆ తర్వాత నా ఫోన్లు హ్యాక్ అయ్యాయని అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. తన పెళ్లే ఒక అబద్ధమని చెప్పాడని.. ఆ పుట్టిన బేబీ కూడా మూవీ ప్రమోషన్ కోసం ఆడిన నాటకం అని అన్నట్టు ఆమె వెల్లడించింది. ఇది దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఎవరైనా సరే నైతికంగా తప్పుడు పనులకు పాల్పడతారో వారు మనుషులు కాదు, రాక్షసులు. అందుకే వారిని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాను. అధర్మాన్ని నాశనం చేయడమే ధర్మం యొక్క అసలైన ఉద్దేశం. అదే గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ‘ అని తన ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది.

ఇక ఈ స్టేటస్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. మరి దీనిపైన రణబీర్ కి అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version