జగన్ ను విమర్శించాలన్న.. పొగడాలన్న.. అతడేనా?

ప్రశ్నించేందుకే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎప్పుడు చెబుతూ ఉంటాడు. సినిమాలను వదులుకొని ప్రజా సేవ చేస్తానని పార్టీ ప్రకటించిన చెప్పిన పవన్ కిందటి ఎన్నికల్లో ప్రజలిచ్చిన షాక్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడిని పల్లెత్తు మాట అని పవన్ కల్యాణ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడేవారు. ఇక కిందటి ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చాక […]

Written By: Neelambaram, Updated On : July 4, 2020 3:19 pm
Follow us on


ప్రశ్నించేందుకే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎప్పుడు చెబుతూ ఉంటాడు. సినిమాలను వదులుకొని ప్రజా సేవ చేస్తానని పార్టీ ప్రకటించిన చెప్పిన పవన్ కిందటి ఎన్నికల్లో ప్రజలిచ్చిన షాక్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడిని పల్లెత్తు మాట అని పవన్ కల్యాణ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడేవారు. ఇక కిందటి ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చాక పవన్ ప్రశ్నించడం ఎక్కువైంది. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ ఇందులో రాజకీయ దురుద్ధేశం ఆపాదిస్తుండటంతో పవన్ పై కూడా విమర్శలు మొదలయ్యాయి.

చంద్రబాబు గుడులను కూడా వదల్లేదుగా..!

ఎప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజా ఆయనను పొడుగుతూ ట్వీట్ చేయడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ ఇటీవల ఏపీలో భారీ సంఖ్యలో 108 సేవలను ప్రారంభించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏపీ అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పెద్దఎత్తున 108, 104సేవలను ప్రారంభించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. దర్శకుడు పూరి జగన్మాథ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?

తాజాగా పవన్ కల్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమంపై పొగడత్తల వర్షం కురిపించారు. ఈమేరకు తన ట్వీటర్లో ట్వీట్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ‘ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు.. అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులను, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం-అభినందనీయం..’ అని ఆయన ట్వీట్ చేసారు. ‘అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా, ప్రభుత్వం చేస్తున్న పని తీరు అభినందనీయమని’ ట్వీట్ చేశాడు. ఇటీవల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన పనితీరుతో తిట్టినోటితోనే శభాష్ అనిపించుకోవడం ఆనవాయితీగా మారుతోంది. ఎంతైనా విమర్శినోడే.. పొడిగితే వచ్చే కిక్కే.. వేరప్పా అని జగన్ అభిమానులు అంటున్నారు.