Homeఆంధ్రప్రదేశ్‌రాజధాని ఉద్యమానికి ప్రజామద్దతు ఎందుకు లేదు?

రాజధాని ఉద్యమానికి ప్రజామద్దతు ఎందుకు లేదు?


చంద్రబాబు కలల ప్రాజెక్ట్ అమరావతి నిర్మాణం. లక్షల కోట్ల వ్యయం సింగపూర్ ని తలదన్నే రాజధాని నిర్మిస్తాను అని ప్రజలకు వాగ్దానం చేశారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూములు సేకరించి, స్థానిక రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతా బాగానే ఉంది. బాబు గారి ఐదేళ్ల పాలన ముగిసింది. రాజధాని నిర్మాణంలో అసెంబ్లీ, హైకోర్ట్ మినహా ఎటువంటి శాశ్వత నిర్మాణాలు జరగలేదు. సింగపూరు కంపెనీలతో జరిగిన ఒప్పందాల వలన ఒరిగిన ప్రయోజనం ఏమి లేదు. 2019 లో ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో అసలు సమస్య మొదలైంది. అమరావతికి నేను వ్యతిరేకం కాదన్న జగన్…అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు.

జగన్ ను విమర్శించాలన్న.. పొగాడాలన్న.. అతడేనా?

దీనిని పూర్తిగా వ్యతిరేకించిన రాజధాని రైతులు మేము మోసపోయాం అంటూ…అమరావతి ఉద్యమానికి తెరలేపారు. మూడు రాజధానులు వద్దంటూ, దీక్షలు చేపట్టారు. ఈ ఉద్యమంలో పోలీసులకు, రైతులకు మధ్య పరస్పర దాడులు జరిగాయి. ప్రజాప్రతినిధులపై కూడా రైతులుదాడి చేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి తరువాత దీక్షా శిబిరాల నుండి నిరసన కారులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇళ్ల దగ్గర నుండే వీళ్లు నిరసనలు కొనసాగించడం జరిగింది. ఐతే వీరి ఉద్యమానికి ప్రజా మద్దతు దొరకలేదు.

సీఎం జగన్ కు ముద్రగడ లేఖ.. వెనకున్నదేవరు?

అమరావతి ఉద్యమం మొదలై 200ల రోజులు దాటింది. టీడీపీ సోషల్ మీడియా దీనికి ప్రచారం కలిపిస్తూనే ఉంది. అమరావతి ప్రాజెక్ట్ ని, అక్కడి వారి భవిష్యత్తును నీరుగార్చిన సీఎం గా జగన్ ని వారు దూషిస్తున్నారు. రెండు వందల రోజులుగా ఉద్యమం జరుగుతున్నా ప్రజల్లో ఎందుకు చైత్యనం లేదు?. అయ్యో పాపం అమరావతి రైతులు అని ఎందుకు ఎవరూ, వారి తరపున మాట్లాడం లేదు? రాష్ట్ర రాజధాని ఉద్యమం కొన్ని గ్రామాలకే ఎందుకు పరిమితం అయ్యింది?. దానికి కారణం ఈ ఉద్యమంలో పాల్గొన్న వారంతా భూయజమానులే కానీ రైతులు కాదనేది కొందరి వాదన. ఆర్థికంగా బలపడిన వర్గానికి చెందిన వీరి ఉద్యమానికి అక్కడి బడుగు బలహీన వర్గాల నుండి వస్తున్న మద్దతు అంతంత మాత్రం గానే ఉంది. ఇక మూడు రాజధానుల వలన అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత, అభివృద్ధి చేకూరుతుందని ప్రజలు భావిస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణా తరహా విభన ఉద్యమాలకు బీజం పడకుండా ఉండాలన్నా, హైదరాబాద్ లాంటి ఆర్థిక రాజధాని ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ఉండాలన్నా…మూడు రాజధానుల నిర్ణయం మంచిదని, అధిక ప్రజానీకం భావించడం కూడా కారణం కావచ్చు. అందుకే రోజుల తరబడి సాగుతున్న అమరావతి ఉద్యమం, ఒక పార్టీకి, ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version