భారత్ దెబ్బకు చైనాకు లక్ష కోట్ల నష్టం?

తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నే వాడొకడు ఉంటారనేది మన పెద్దలు ఎప్పడూ చెబుతూనే ఉంటారు. అందుకే ఎవరినీ కూడా తక్కువ అంచనా వేయద్దని సలహాలు ఇస్తుంటారు. చైనా విషయంలో భారత్ ఈ ఫార్ములాను ఫాలో అవుతోంది. సైనిక శక్తి, ఆర్థిక బలం ఉందని వీర్రవీగా భారత్ పై దాడికి సిద్ధమైన చైనాకు భారత్ కూడా తగిన రీతిలో గుణపాఠం చెబుతోంది. భారత్ ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్ కు చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కేంద్రం ప్రభుత్వం […]

Written By: Neelambaram, Updated On : July 4, 2020 3:22 pm
Follow us on


తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నే వాడొకడు ఉంటారనేది మన పెద్దలు ఎప్పడూ చెబుతూనే ఉంటారు. అందుకే ఎవరినీ కూడా తక్కువ అంచనా వేయద్దని సలహాలు ఇస్తుంటారు. చైనా విషయంలో భారత్ ఈ ఫార్ములాను ఫాలో అవుతోంది. సైనిక శక్తి, ఆర్థిక బలం ఉందని వీర్రవీగా భారత్ పై దాడికి సిద్ధమైన చైనాకు భారత్ కూడా తగిన రీతిలో గుణపాఠం చెబుతోంది. భారత్ ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్ కు చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కేంద్రం ప్రభుత్వం చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. భారత్ తాజా నిర్ణయాలతో చైనాకు ఇప్పటికే ఏకంగా లక్ష కోట్ల నష్టం వాటిలినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు గుడులను కూడా వదల్లేదుగా..!

గాల్వానా లోయలో ఇరుదేశాల ఘర్షణ అనంతరం చైనా-భారత్ సంబంధాలు తగ్గుముఖంగా పట్టాయి. శాంతి చర్చల అంటూనే నక్కజిత్తులతో భారత జవాన్ల మృతికి కారణమైన చైనాకు భారత్ తగిన గుణపాఠం చెబుతోంది. చైనాతో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమవుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితులను బట్టి నిర్ణయాన్ని తీసుకునే అధికారం కట్టబెట్టింది. అంతేకాకుండా త్రివిధ దళాలు సంసిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. భారత రక్షణ జోలికి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని ప్రకటించింది.

చైనా విషయంలో కేంద్రం బహుముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. చైనాను రక్షణపరంగానే కాకుండా ఆర్థికంగా, దౌత్యపరంగా దెబ్బకొడుతోంది. సరిహద్దుల్లో భారత జవాన్లపై మృతి విషయంలో దౌత్యపరంగా చైనాదే తప్పు అని ప్రపంచానికి చాటిచెప్పడంతో భారత్ విజయం సాధించింది. దీంతో అమెరికా, రష్యా, జపాన్ లాంటి దేశాలు భారత్ కు బహిరంగంగానే మద్దతు పలికాయి. మరోవైపు భారత్ లో చైనా కంపెనీలకు చెందిన పలు కాంట్రాక్టులను భారత్ రద్దు చేసింది. రైల్వే, హైవే, టెలికాం రంగాల్లో ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను రద్దుచేసి షాకిచ్చింది. తాజాగా చైనాకు చెందిన 59యాప్స్ నిషేధించి చైనాను కోలుకులేని దెబ్బతీసింది.

ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?

చైనాకు చెందిన కాంట్రాక్టులు, యాప్స్ రద్దు చేయడంతో చైనాకు ఆర్థికంగా భారీ నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. చైనా యాప్స్ రద్దు చేయడం ద్వారానే 49వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇక చైనాకు చెందిన కాంట్రాక్టులను రద్దు చేయడం వల్ల వేల కోట్ల నష్టం వాటిల్లిందనే ప్రచారం జరుగుతోంది. వీటివిలువ సుమారు లక్ష కోట్ల పైమాటే ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చైనా భారత్ తో ఎందుకు పెట్టుకున్నార్రా దేవుడా అని కుర్రో.. ముర్రో అంటోంది.

చైనా తన సైన్యంతో భారత్ ను భయపెట్టి సరిహద్దులను ఆక్రమించుకోవాలనుకుంటే ఊహించిన విధంగా భారత్ షాకిస్తుండటం ఆ దేశం తలలు పట్టుకుంటోంది. భారత్ విషయంలో చైనా తన వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఆదేశం మరింత మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు అంటున్నారు. ఇప్పటికైనా చైనా తన వక్రబుద్ది మార్చుకుంటుందో.. లేక కుక్కతోక వంకర అన్న చందంగా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే..!