Karthikeya 3: కార్తికేయతో మొదలైన హీరో నిఖిల్ ప్రస్థానం.. ‘కార్తికేయ2’తో దేశవ్యాప్తం అయ్యింది. శ్రీకృష్ణుడి చరిత్రను అంతే వివరంగా చెప్పిన విధానం హిందీ జనాలకు విపరీతంగా నచ్చేసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా మలిచేసింది. కార్తికేయ సినిమాల పేరుతో హీరో నిఖిల్-దర్శకుడు చందూమొండేటి సృష్టించిన హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేయాలని వారంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘కార్తికేయ3’కి కూడా పురుడు పోసినట్టు తెలిసింది.ఇప్పటికే కార్తికేయ 2 సినిమా చివర్లో ఈ మేరకు హింట్ కూడా ఇచ్చారు. మరో శోధన కోసం హీరో నిఖిల్ బయలు దేరుతున్నట్టు ప్రకటించారు.

హిందీలో శ్రీకృష్ణతత్వానికి మంచి గుర్తింపు దక్కి సినిమా హిట్ కావడంతోపాటు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ ఊపులోనే ఇప్పుడు ‘కార్తికేయ3’కి కూడా కథను సిద్ధం చేసినట్టు సమాచారం. కార్తికేయ 3పై ఇప్పుడు దేశవ్యాప్తంగా బజ్ నెలకొంది. సినిమాపై అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయ్యింది.
కార్తికేయ2 టెంపుల్ నేపథ్యంలో సాగగా.. కార్తికేయ3 సినిమా అయోధ్య రామమందిరం నేపథ్యంలో రానుందని సమాచారం. ప్రస్తుతం దేశంలో అన్నింటికంటే ట్రెండింగ్ అయోధ్య రామాలయం. హిందువులు అంతా భక్తితో కొలిచే ఈ ఆలయ చరిత్ర చుట్టూ కథను రాసుకున్నట్టు సమాచారం. ఇది అదిరిపోయేలా వచ్చిందని.. అయోధ్యకు మరింత పేరు తెచ్చే సినిమా అవుతుందని అంటున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని.. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

ప్రస్తుతం నిఖిల్ ‘118 పేజీస్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా మిస్టరీ కథాంశమే. దీంతోపాటు స్పై అనే ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. ఇలా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నిఖిల్ ముందుకు సాగుతున్నారు.