
జనసేనాని రాక కోసం ఆయన పార్టీ కేడర్ ఎదురుచూస్తోంది. ఫీల్డ్ లో లేకున్నా పంచాయతీ ఎన్నికల్లో దున్నేసిన జగన్ నిజంగా క్షేత్రస్థాయిలో మమేకం అయితే జనసేన అద్భుతాలు సాధిస్తుందని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యకర్తలు, నేతలతో కలిసిపోవాలని పాదయాత్ర లాంటిది చేపట్టాలని కోరుతున్నారు. ఎన్నికలంటే ఏముంది ఏడాది ముందు ప్రజల్లోకి వెళితే జనసేనకు తిరుగుండదు అని అంటున్నారు. ఇప్పుడు ఈ అంశం జనసైనికుల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: జనంలోకి జగన్.. వారు అప్రమత్తం..
పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తరువాత ప్రజల్లో పెద్దగా తిరగలేదు. కేవలం2019 ఎన్నికల ప్రచారంలో మాత్రమే ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అంతకు ముందు ఉద్దానం సమస్య, రైతు సమస్యలపై పవన్ స్పందించారు. అయినా ఆయన పార్టీని ఎవరూ ఆదరించలేదు. కేవలం ఒక్క స్థానానికే పరిమితం చేశారు. ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా పవన్ కల్యాణ్ పెద్దగా ప్రజల్లో పర్యటించలేదు. సమస్యలపై స్పందించలేదు. తనబలం తనకు తెలిసొచ్చిందో ఏమో బీజేపీతో పొత్తుకు దిగిపోయారు. అనాలోచిత నిర్ణయంతో ఆ పార్టీకి దగ్గరైపోయారు. ఫలితంగా ఇప్పుడు అవసరం లేకపోయినా.. బీజేపీ పార్టీకి దగ్గర అవుతున్నారు.
ఇక తాను ప్రజల్లోకి వస్తే.. సెక్యూరిటీ సమస్య వస్తుందని పవన్ కల్యాణ్ పదేపదే చెప్పుకొస్తున్నారు. అభిమానులు తన పర్యటనలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందకే దాదాపు జనం పర్యటనకు పవన్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ.. ఆయన పాల్గొనలేదు. అనేకచోట్ల జనసైనికులు తమ పార్టీని విజయం వైపు నడిపించేందుకు కృషి చేశారు. అప్పుడప్పుడు కనిపించినంత మాత్రాన ప్రజలు తమవాడిని అర్థం చేసుకోరు.
Also Read: పోలింగ్ కు ముందే పోటీలో ఉన్న 100 మంది మృతి..
ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా కొంత తగ్గిన తరువాత తన పర్యటనలను ప్రారంభించారు. సమస్యలపై స్పందిస్తున్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సైతం జనంలోకి వెళ్తున్నాయి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం షూటింగ్ షెడ్యూల్ తో బిజీగా మారుతున్నారు. సినిమాలు పూర్తయిన తరువాతే.. జనంలోకి వచ్చే అవకాశం ఉంది. అదికూడా ఎంపిక చేసుకున్న కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారంట.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
