పోస్టల్ డిపార్టుమెంట్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో ఆకర్షణీయమైన స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ అమలు చేస్తున్న స్కీమ్ లలో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఒకటి. చాలా సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ అమలులో ఉన్నా వినియోగదారులకు ఈ స్కీమ్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ స్కీమ్ లో ఎక్కువమంది చేరడం లేదు.
Also Read: ప్రజలకు అలర్ట్.. ఏప్రిల్ లో బ్యాంకు సెలవులు ఇవే..?
1995 సంవత్సరం నుంచి ఈ స్కీమ్ అమలులో ఉండగా గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తున్న పేద ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ స్కీమ్ లో కనిష్టంగా 10,000 రూపాయలు డిపాజిట్ చేసే అవకాశం ఉండగా 10 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. పాలసీ తీసుకున్న 4 సంవత్సరాల తరువాత అవసరమైతే డిపాజిట్ చేసిన మొత్తంపై లోన్ తీసుకోవచ్చు.
Also Read: మెరుపు తగ్గుతున్న బంగారం.. ధరలు ఎందుకు పడిపోతున్నాయో తెలుసా?
ఈ స్కీమ్ లో చేరిన తరువాత 5 సంవత్సరాల లోపు డిపాజిట్ చేసిన మొత్తం విత్ డ్రా చేసుకుంటే బోనస్ పొందే అవకాశం ఉండదు. ఉదాహరణకు 30 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి ఈ స్కీమ్ లో పాలసీని పొడిగించుకుంటూ 60 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. 30 సంవత్సరాల వ్యక్తి నెలకు రూ.1045 చొప్పున ప్రీమియం కడితే అసలు రూ.5 లక్షలకు అదనంగా 9 లక్షల రూపాయల బోనస్ వస్తుంది.
సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఏదైనా కారణం వల్ల పాలసీదారుడు చనిపోతే నామినీ ఆ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.