Pawan kalyan On Rayalaseema: రాయలసీమ..గత ఎన్నికల్లో వైసీపీకి అంతులేని విజయాన్ని కట్టబెట్టిన ప్రాంతం. సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నమ్మి అన్నివర్గాల ప్రజలు ఆయనకు అండగా నిలిచారు. ఏకపక్ష విజయాన్ని అందించారు. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ రివర్స్ అయ్యింది. ప్రజలకు కష్టాలు తప్పలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు అతీగతీ లేదు. ఏది అడిగినా నవరత్నాలే అంటున్నారు. అందులో కూడా అర్హులకు మొండి చేయి చూపుతున్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు లేవు. పంటలకు గిట్టుబాటు లేదు.ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు.వరుస విపత్తులు రాయలసీమ ప్రజలను మరింత కృంగదీస్తున్నాయి. నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేకపోతోంది. ఒక విధంగా చెప్పాలంటే వారిలో నైరాశ్యం అలుముకుంది. ఇటువంటి సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారికి భరోసాలా కనిపిస్తున్నారు. ఇప్పటికే అనంతపురం కౌలురైతు భరోసా యాత్ర చేపట్టిన పవన్ అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయమందించారు. కడపలో మలి విడత యాత్ర చేపట్టడానికి సన్నద్ధమవుతున్నారు. ఇంతలో రాయలసీమ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఆదివారం తిరుపతిలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

నాలుగో విడతగా..
ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేనాని పవన్ నేరుగా రంగంలోకి దిగారు. జనవాణి పేరిట వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవాడలో రెండుసార్లు, భీమవరం ఒకసారి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది ప్రజలు తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని సవధానంగా విన్న పవన్ అక్కడికక్కడే కొన్నింటికి పరిష్కారమార్గం చూపించగలిగారు. ఇంకొన్నింటిపై సంబంధిత శాఖల అధికారులకు లేఖ రాశారు. అటు జనసైనికులు కూడా సమస్యల పరిష్కారానికి తమవంతు కృషిచేశారు. జనవాణిలో వచ్చిన మెజార్టీ వినతులకు పరిష్కార మార్గం దొరకడంతో కార్యక్రమానికి ఆదరణ పెరుగుతూ వస్తోంది. అన్ని ప్రాంతాల్లో కార్యక్రమం నిర్వహించాలని ప్రజల నుంచి వినతులు వస్తున్నాయి. ఇప్పడు రాయలసీమ ప్రజల కోసం తిరుపతిలో ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తిరుపతిలో జీఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ లో ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను జనసైనికులు పూర్తిచేశారు.

పెరుగుతున్న ఆదరణ..
రాయలసీమలో అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకునే వీలుగా అందరికీ అందుబాటులో ఉండే తిరుపతిలో జనవాణి కార్యక్రమం ఏర్పాటుచేశారు. విజయవాడలో జరిగిన రెండు విడతల కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరి సమస్యలను పవన్ కళ్యాణ్ సావధానంగా విన్నారు. అక్కున చేర్చుకున్నారు. వారిలో భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. తిరుపతిలో కూడా అందరి విన్నపాలను పరిగణలోకి తీసుకోనున్నారు. వ్యక్తిగత, సామాజిక సమస్యలను తెలుసుకోనున్నారు. అయితే తిరుపతి ప్రజావాణి జనవాణి వేదికగా పవన్ కీలక వ్యాఖ్యాలు, ప్రకటనలు చేసే అవకాశముందని జనసేనవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆయన సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కౌలురైతు భరోసా యాత్రకు సిద్ధపడుతున్న దృష్ట్యా రాయలసీమలో అందరి దృష్టి జనసేనపై పడింది. పవన్ ప్రకటనలతో రాయలసీమ రాజకీయాల్లో మార్పులకు అవకాశముంటుందని కూడా జనసైనికులు చెబుతున్నారు.
Also Read:Rental Agreement: అద్దె ఒప్పందం 11 నెలలు మాత్రమే ఎందుకు చేసుకుంటారు..?
[…] Also Read: Pawan kalyan On Rayalaseema: రాయలసీమ కష్టాలపై కదిలివస్… […]
[…] Also Read: Pawan kalyan On Rayalaseema: రాయలసీమ కష్టాలపై కదిలివస్… […]
[…] Also Read:Pawan kalyan On Rayalaseema: రాయలసీమ కష్టాలపై కదిలివస్… […]