యువత కోసం రోడ్డెక్కబోతున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ తన పవరేంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఏపీలో యాక్టివ్ అవుతున్నారు. ఈసారి సీఎం జగన్ సర్కార్ పై ఒక కీలక పాయింట్ తో ముందుకెళుతున్నారు. పవర్ స్టార్ కు బలం, బలగం అయిన యువత సమస్యను ప్రధానంగా చేపట్టారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు తమ పార్టీ బాసటగా నిలిచి పోరాటం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలోని నిరుద్యోగుల […]

Written By: NARESH, Updated On : July 17, 2021 10:13 am
Follow us on

పవర్ స్టార్ తన పవరేంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఏపీలో యాక్టివ్ అవుతున్నారు. ఈసారి సీఎం జగన్ సర్కార్ పై ఒక కీలక పాయింట్ తో ముందుకెళుతున్నారు. పవర్ స్టార్ కు బలం, బలగం అయిన యువత సమస్యను ప్రధానంగా చేపట్టారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు తమ పార్టీ బాసటగా నిలిచి పోరాటం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఏపీలోని నిరుద్యోగుల కోసం పవన్ పోరాటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఈనెల 20న అన్ని జిల్లాల్లోని ఉపాధి కల్పన అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించినట్టు పవన్ తెలిపారు.

ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చాలని పవన్ డిమాండ్ చేశారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ చెప్పిన మాటలు నమ్మిన నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ లో చూపించిన ఖాళీలతో నిరాశ చెందిందన్నారు.

గత రెండేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం అందుకు సంబంధించిన పోటీ పరీక్షల కోసం యువత ఎన్నో కష్టాలు ఓర్చుకొని సిద్ధమవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే ఏపీపీఎస్సీ ద్వారా కేవలం 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 10వేల ఉద్యోగాలను మాత్రమే కల్పించడం ఖచ్చితంగా యువతను మోసం చేయడమేనన్నారు.

మోసపోయిన నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన దీనిపై ఏపీ ప్రభుత్వంపై పోరుబాటకు పవన్ శ్రీకారంచుట్టారు. వెంటనే ఉద్యోగాలతోపాటు మెగా డీఎస్సీని వేయాలని.. పోలీస్ శాఖలో 7వేల ఖాళీలు భర్తీ చేయాలన్నారు. ఈ మేరకు పోరుబాట పట్టనున్నట్టు పవన్ తెలిపారు.