‘ఆర్ఆర్ఆర్’ను మించిపోయిన కేజీఎఫ్2

నిన్ననే మేకింగ్ వీడియోతో షేక్ చేసిన రాజమౌళికి ఆనందం లేకుండా చేసింది కేజీఎఫ్2 టీం. ఆర్ఆర్ఆర్ వీడియోకు వచ్చిన వ్యూస్ ను మించి యూట్యూబ్ లో కేజీఎఫ్2 సంచలనాలు సృష్టించింది. దేశమంతా తనవైపు చూసేలా చేసిన ఈ కన్నడ చిత్రం దెబ్బకు హీరో యష్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కేజీఎఫ్2 టీజర్ విడుదలైన 24 గంటల్లోనే ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఏకంగా సరికొత్త రికార్డును సొంతం […]

Written By: NARESH, Updated On : July 17, 2021 10:45 am
Follow us on

నిన్ననే మేకింగ్ వీడియోతో షేక్ చేసిన రాజమౌళికి ఆనందం లేకుండా చేసింది కేజీఎఫ్2 టీం. ఆర్ఆర్ఆర్ వీడియోకు వచ్చిన వ్యూస్ ను మించి యూట్యూబ్ లో కేజీఎఫ్2 సంచలనాలు సృష్టించింది. దేశమంతా తనవైపు చూసేలా చేసిన ఈ కన్నడ చిత్రం దెబ్బకు హీరో యష్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

కేజీఎఫ్2 టీజర్ విడుదలైన 24 గంటల్లోనే ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఏకంగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. జనవరి 7న విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో 200 మిలియన్ల వ్యూస్ సాధించి దుమ్మురేపుతోంది. ఈ టీజర్ కు ఇప్పటివరకు ఏకంగా 8.4 మిలియన్ లైక్స్ రావడం మరో విశేషం.

హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేసిన చిత్రబృందం సినిమా కథను గుర్తు చేస్తూ జరగబోయే కథను వివరిస్తూ ఈ టీజర్ ను రూపొందించారు. యష్ ఈ టీజర్ లో విశ్వరూపమే చూపించాడు. విజువల్స్, బీజీఎం మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇప్పటివరకు ఈ వీడియో 20 కోట్లకుపైగా వ్యూస్ సాధించింది. దీంతోపాటు తమ వీడియో 8.4 మిలియన్లకు పైగా లైక్స్, 11 మిలియన్లకు పైగా కామెంట్స్, వందకోట్లకు పైగా ఇంప్రెషన్స్ సంపాదించిందని యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసి ప్రకటించారు.

టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి చూస్తే సినిమా మరింతగా దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది. నిన్న ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో సంచలనాన్ని మరవకముందే కేజీఎఫ్2 మరో రికార్డును క్రియేట్ చేయడం విశేషం.