Bigg Boss Rathika: నాలుగో వారం మరో కంటెస్టెంట్ ఇంటిని వీడింది. ఈసారి రతికా రోజ్ తట్టా బుట్టా సర్దింది. ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు. ప్రిన్స్ యావర్, ప్రియాంక, శుభశ్రీ, గౌతమ్ ఒక్కొక్కరిగా సేఫ్ అయ్యారు. ఇక చివరి రౌండ్ కి రతికా రోజ్, టేస్టీ తేజా మిగిలారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఫైనల్ గా నాగార్జున తేజా సేఫ్, రతికా రోజ్ ఎలిమినేట్ అని చెప్పాడు.
దాంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న రతికా రోజ్ అనూహ్యంగా ఇంటిదారి పట్టింది. విపరీతమైన నెగిటివిటీ ఆమెకు నష్టం చేకూర్చింది. అందుకు ఆమె చర్యలు కారణమయ్యాయి. మాజీ లవర్ రాహుల్ సిప్లిగంజ్ పేరు బయటకు తీసి సింపతీ పొందాలని చూసింది. కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ తో దారుణంగా ప్రవర్తించింది. అతన్ని అన్నారని మాటలు అంది. అలాగే ఫేక్ గేమ్స్, ఫేక్ రిలేషన్స్ కొనసాగించింది.
కంటెంట్ కోసం ఇతర కంటెస్టెంట్స్ ని ఇబ్బంది పెట్టింది. ప్రతి విషయంలో తానే హైలెట్ కావాలని చూసింది. వెరసి ఆడియన్స్ రతికా రోజ్ పై హేహ్య భావన పెంచుకున్నారు. రతికా రోజ్ ని ఎలిమినేట్ చేయాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అలాగే ఆమెకు ఓట్లు పడలేదు. దాంతో టాప్ కంటెస్టెంట్ అనుకున్న రతికా రోజ్ ఆట మధ్యలో ముగిసింది.
ఎలిమినేట్ అయినప్పటికీ రతికా రోజ్ గట్టిగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఆమె రోజుకు రూ. 28 వేలు తీసుకుందట. అంటే దాదాపు వారానికి రూ. 2 లక్షలు. నాలుగు వారాలున్న రతికా రోజ్ రూ. 8 లక్షల వరకు తీసుకున్నారని అంటున్నారు. రతికా రోజ్ కి బయట అంత ఫేమ్ లేదు. యూట్యూబ్ ప్రేక్షకులకు మాత్రమే ఆమె తెలుసు. కాబట్టి ఆమె ఇమేజ్ కి ఇది పెద్ద అమౌంట్ అనవచ్చు. త్వరగా ఎలిమినేట్ అయినా రతికా రోజ్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆమెకు మంచి ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు.