Pawan Kalyan : కారు నుంచి కట్‌డ్రాయర్‌ వరకూ దేన్ని వదలరా..? వైసీపీ పరువుతీసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan criticized YCP with tweets : పవన్ కళ్యాణ్ ట్వీట్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా తన ప్రచార రథం ‘వారాహి’కి మిలటరీ రంగు వేయడాన్ని విమర్శిస్తున్న వైసీపీని సోషల్ మీడియాలో కడిగేశాడు. జనసేనను తోక్కేయాలని వైసీపీ చూస్తోందని.. తమ మీద కాన్ సన్ ట్రేట్ చేయడం మానేసి ఏపీ అభివృద్ధి చేయాలని పవన్ హితబోధ చేశాడు. ‘అసూయతో వైసీపీ ఎముకలు రోజురోజుకూ కుళ్లిపోతున్నాయి’ అంటూ ట్వీట్ లో ఘోరంగా దెప్పిపొడిచాడు. శాంతితో ఉన్న హృదయం […]

Written By: NARESH, Updated On : December 9, 2022 9:09 pm
Follow us on

Pawan Kalyan criticized YCP with tweets : పవన్ కళ్యాణ్ ట్వీట్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా తన ప్రచార రథం ‘వారాహి’కి మిలటరీ రంగు వేయడాన్ని విమర్శిస్తున్న వైసీపీని సోషల్ మీడియాలో కడిగేశాడు. జనసేనను తోక్కేయాలని వైసీపీ చూస్తోందని.. తమ మీద కాన్ సన్ ట్రేట్ చేయడం మానేసి ఏపీ అభివృద్ధి చేయాలని పవన్ హితబోధ చేశాడు. ‘అసూయతో వైసీపీ ఎముకలు రోజురోజుకూ కుళ్లిపోతున్నాయి’ అంటూ ట్వీట్ లో ఘోరంగా దెప్పిపొడిచాడు. శాంతితో ఉన్న హృదయం శరీరానికి జీవాన్ని ఇస్తుంది, కానీ అసూయ ఎముకలను కుళ్ళిస్తుందని.. విద్యార్థులు ఈర్ష్యగా భావించినప్పుడు మరియు ఇతర పిల్లల విషయాల గురించి దెబ్బతీసేందుకు ప్రయత్నించినప్పుడు ఈ కోట్ తరచుగా మా క్లాస్ టీచర్ ద్వారా పాఠశాలలో చెప్పబడిందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్ లో ప్రతిపక్షాలను అధికారపక్షం అహంకారంతో అసూయపడుతుంది అంటూ వైసీపీ పెద్దల తీరును తూర్పార పట్టారు.

వైసీపీ టిక్కట్‌ రేట్‌లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని పవన్ ట్వీటర్ లో హితవు పలికారు. ఇప్పటికే ఏపీలో వీరి లంచాలు, వాటాలు వేధింపుల వలన “ కారు నుంచి కట్‌డ్రాయర్‌ కంపెనీల “ దాకా పక్క రాష్ట్రంకి తరలిపోయాయ్‌.. అంటూ సంచలన విమర్శలతో పవన్ నిప్పులు చెరిగారు. ఈ విమర్శలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

జనసేన ప్రచార రథానికి మిలటరీ రంగులు ఉంటే తప్పుపట్టిన వైసీపీ బ్యాచ్ కు అలాంటి రంగు ఉన్న కార్లు, బైక్ ల ఫొటోలను చూపించి మరీ పవన్ కడిగేశాడు. వీటన్నింటికి మిలటరీ రంగు ఉండగా తప్పు లేనిది తన ప్రచార రథం ‘వారాహి’కి ఉంటేనే తప్పా? అంటూ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. ఇక ఏపీలోని పచ్చటి అడవిని ఫొటోను షేర్ చేసిన పవన్ ఈ గ్రీనరీ కూడా మిలటరీ రంగులో ఉందని.. దీన్ని కూడా లేకుండా చేస్తుంది కావచ్చూ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

https://twitter.com/PawanKalyan/status/1601170617000407040?s=20&t=T0S1zF5MaEqTlz5678GByQ

అంతకుముందు కూడా పవన్ ట్వీట్లతోనే వైసీపీ వైఖరిని తప్పుపట్టారు. ‘మొదట ఈ వైసీపీ వాళ్లు నా సినిమాలను ఆపేశారు.. విశాఖపట్నంలో నన్ను వాహనం & హోటల్ గది నుండి బయటకు రానివ్వలేదు.. నన్ను నగరం వదిలి వెళ్ళమని నోటీసులు ఇచ్చారు. మంగళగిరిలో మీరు నా కారు నుంచి బయటకు వెళ్లనివ్వలేదు, తర్వాత నన్ను కనీసం నడవనివ్వలేదు.. ఇప్పుడు నా ప్రచార రథం రంగు సమస్యగా మారింది. కనీసం నన్ను నేను ఊపిరి తీసుకోనిస్తారా? పీల్చకుండా చేస్తారా?’ అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రచార వాహనాన్ని రాజకీయం చేయడాన్ని కడిగేశాడు. ఇప్పుడు వరుస ట్వీట్లతో మరోసారి వైసీపీపై నిప్పుల వర్షం కురిపించారు.