https://oktelugu.com/

Prabhas’ wedding : ప్రభాస్ పెళ్లి పై లేటెస్ట్ న్యూస్… ముగ్గురు చెల్లెళ్ళ కోసం ఊహించని నిర్ణయం!

Latest news on Prabhas’ wedding  : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్నారు ప్రభాస్. 43 ఏళ్ల ఈ స్టార్ హీరో  ఎప్పుడు చేసుకుంటారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఆయన గాడ్ ఫాదర్ కృష్ణంరాజు తుది శ్వాస వరకు ప్రభాస్ కి పెళ్లి చేయాలని ప్రయత్నం చేశారు. ఎంతగానో ప్రేమించే పెదనాన్న మాట కూడా ప్రభాస్ వినలేదు. కృష్ణంరాజు, ఆయన భార్య ఎక్కడికెళ్లినా వారిని ప్రభాస్ పెళ్లి ఎప్పుడనే ప్రశ్న వెంటాడేది. కచ్చితమైన […]

Written By: , Updated On : December 9, 2022 / 10:13 PM IST
Follow us on

Latest news on Prabhas’ wedding  : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్నారు ప్రభాస్. 43 ఏళ్ల ఈ స్టార్ హీరో  ఎప్పుడు చేసుకుంటారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఆయన గాడ్ ఫాదర్ కృష్ణంరాజు తుది శ్వాస వరకు ప్రభాస్ కి పెళ్లి చేయాలని ప్రయత్నం చేశారు. ఎంతగానో ప్రేమించే పెదనాన్న మాట కూడా ప్రభాస్ వినలేదు. కృష్ణంరాజు, ఆయన భార్య ఎక్కడికెళ్లినా వారిని ప్రభాస్ పెళ్లి ఎప్పుడనే ప్రశ్న వెంటాడేది. కచ్చితమైన సమాధానం వారి దగ్గర ఉండేది కాదు. దాంతో ఏదో ఒకటి చెప్పి మాట దాటేసేవారు. సమాజం కోసమైనా ప్రభాస్ కి పెళ్లి చేయాలని వారు తపించారు.

 

ప్రభాస్ తో పాటు పరిశ్రమకు వచ్చిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, కొంచెం ముందొచ్చిన పవన్, మహేష్ సైతం వివాహాలు చేసుకున్నారు. వారసులను కూడా కన్నారు. ప్రభాస్ మాత్రం కనీసం పెళ్లి పీటలు ఎక్కలేదు. అంతకంతకూ వయసు మీదపడుతుంటే ఇంకెప్పుడు వివాహం చేసుకుంటారనే అసహనం అభిమానుల్లో పెరిగిపోతుంది. కారణం… అభిమానులు వారసత్వం కోరుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ప్రభాస్ లెగసి ముందుకు తీసుకెళ్లే వారసుడు రావాలని ఆశ పడుతున్నారు.

రామ్ చరణ్ మినహాయిస్తే ఈ జనరేషన్ టాప్ స్టార్స్ అందరికీ వారసులు ఉన్నారు. ఇక ప్రభాస్ ప్రేమలో పడ్డారంటూ పలుమార్లు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఒక దశలో ఆయన కాజల్ పై మనసు పడ్డారని వార్తలు వచ్చాయి. ఇక ఏళ్ల పాటు అనుష్కను వివాహం చేసుకుంటారనే కథనాలు వెలువడ్డాయి. మేము స్నేహితులం మాత్రమే అంటూ ఈ బాహుబలి జంట కొట్టిపారేశారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కి ఐ లవ్ యూ చెప్పాడంటూ పుకార్లు తెరపైకి వచ్చాయి.

కృతి సనన్ ఈ వార్తలను ఖండించారు. ప్రభాస్ పెళ్లి పై లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఆయనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చిపారేశారట. సినిమాపైనే నా దృష్టి వివాహం అనే అంకం నా జీవితంలో లేదని స్పష్టం చేశారట. ప్రభాస్ పెద్దమ్మ గట్టిగా నిలదీయడంతో మనసులో మాట కుండబద్దలు కొట్టారట. జీవితాంతం ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తూ బ్రతికేస్తా అన్నారట. అభిమానులనే ఇంత పెద్ద కుటుంబం ఉండగా నాకంటూ ప్రత్యేకంగా భార్య పిల్లలు అవసరం లేదన్నారట. అందులోనూ కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ళ బాధ్యత తనపై ఉందని చెప్పాడట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.