Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- Nara Lokesh: పవన్ కళ్యాణ్, లోకేష్... ఎవరి యాత్రకు ఎంత క్రేజ్? ఎవరికి...

Pawan Kalyan- Nara Lokesh: పవన్ కళ్యాణ్, లోకేష్… ఎవరి యాత్రకు ఎంత క్రేజ్? ఎవరికి అధికారం?

Pawan Kalyan- Nara Lokesh: తెలుగునాట పాదయాత్రలకు విశేష ఆదరణ ఉంది. యాత్రలతో క్రేజ్ పెంచుకోవడంతో పాటు పార్టీని విజయతీరాలకు నడిపించిన నాయకులు ఉన్నారు. దాదాపు పాదయాత్ర చేసిన నాయకులంతా అధికారంలోకి వచ్చారు. కానీ ఏపీ సీఎం జగన్ నాడు జైల్లో ఉన్నప్పుడు ఆయన తరుపున సోదరి షర్మిళ పాదయాత్ర చేశారు. కానీ 2014 ఎన్నికల్లో మాత్రం పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. 2003లో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని పాదయాత్రతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయతీరాలకు చేర్చారు. తానూ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అటు తరువాత చంద్రబాబు పాదయాత్ర చేసి విభజిత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగలిగారు. అటు తరువాత జగన్ ఏపీలో సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసి 2019లో అధికారంలోకి రాగలిగారు. అయితే 2024 ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి ఏపీలో పాదయాత్ర మాట వినిపిస్తోంది. టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు పవన్ బస్సు యాత్రకు సైతం సిద్ధమవుతున్నారు.

Pawan Kalyan- Nara Lokesh
Pawan Kalyan- Nara Lokesh

పాదయాత్ర అంటే.. ఒకటి రెండు రోజులతో ముగిసిపోయేది కాదు. దాదాపు 14 నెలల సమయం పడుతుంది. lదాదాపు అన్నినియోజకవర్గాల కలుపుతూ 4 వేల కిలోమీటర్ల పాదయాత్రకు టీడీపీ నాయకులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే లోకేష్ ఎంత మేర ప్రజల్లోకి చొచ్చుకెళతాడా? అన్న అనుమానం టీడీపీ శ్రేణుల్లో కూడా ఉంది. లోకేష్ పాదయాత్ర ప్రణాళికతోనే గత కొద్ది నెలలుగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. నిపుణుల సలహా, ఆహార నియమాలు పాటించడంతో బాగా సన్నబడ్డారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్రలో నడక ఎంత ముఖ్యమో.. ప్రసంగాలు కూడా అంతే ముఖ్యం. దారిపొడవునా అనేక వర్గాల ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తుంటారు. అటువంటి వాటి విషయంలో స్పాంటెనిస్ గా స్పందించాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు మాట్లాడాల్సి ఉంటుంది. కానీ లోకేష్ ప్రసంగాల్లో వీక్. ఇటీవల కొంత పరిణితి సాధించినా.. మిగతా నాయకులతో పోల్చుకుంటే మాత్రం వెనుకబాటులోనే ఉన్నారు. ఇది ఆయనకు మైనస్ గా మారింది. అయితే తనకు తాను ప్రూవ్ చేసుకునేందుకు లోకేష్ కు పాదయాత్ర ఓ సువర్ణవకాశం. కానీ ఆయన సద్వినియోగం చేసుకుంటారో? లేదో? అన్న బెంగ టీడీపీ శ్రేణులను వెంటాడుతోంది.

Also Read: YCP- TRS: టీఆర్ఎస్ ను తట్టుకోలేక చేతులెత్తేసిన వైసీపీ..ఆ భయంతోనే?

పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సిద్ధపడుతున్నారు. తొలుత అక్టోబరు 2 నుంచి యాత్రను ప్రారంభించాలనుకున్నారు. అటు కాన్వాయ్ నుంచి ఇటు రూట్ మ్యాప్ వరకూ అంతా సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాలతో బస్సు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. త్వరలో షెడ్యూల్ ప్రకటించనున్నట్టు జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే పవన్ బస్సు యాత్ర అనేసరికి అటు అధికార పక్షంలో వణుకు పుట్టింది. జనసేన ఆవిర్భావం తరువాత పవన్ ఏ పని తలపెట్టినా, ఏకార్యక్రమం నిర్వహించినా సక్సెస్ అవుతూ వచ్చింది. పవన్ అనేసరికి జనం స్వచ్ఛందంగా తరలిరావడం పరిపాటిగా మారింది. అటు పవన్ ప్రసంగాల్లో మాటల తూటాలు పేలుతుంటాయి. ప్రత్యర్థుల గుండెకు తాకేలా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండడంతో ఏపీ పట్ల సమగ్ర అవగాహన ఉంది.అన్ని రంగాల్లో సమస్యలపై ఇప్పటికే పవన్ అధ్యయనం చేశారు. అన్ని ప్రాంతాల సమస్యలు తెలుసు. వాటి మూలాల గురించి కూడా పవన్ తెలుసుకున్నారు. అటు ప్రభుత్వ వైఫల్యాలు, ఇటు స్థానిక సమస్యలను పవన్ ఎలుగెత్తి చాటగలరు. అందుకే పవన్ బస్సు యాత్ర అనేసరికి ఒకరకమైన క్రేజ్ ఏర్పడింది. అన్ని పార్టీల వలే జనసేన వాహనాలను సమకూర్చుకున్నా దానిని అధికార పక్షం బూతద్ధంలో చూపే ప్రయత్నం చేసింది.

Pawan Kalyan- Nara Lokesh
Pawan Kalyan- Nara Lokesh

ప్రస్తుతం జనసేన గ్రాఫ్ పెరిగినట్టు సర్వే నివేదికలు చెబుతున్నాయి. అటు రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కానీ పవన్ బస్సు యాత్ర అంటూ అన్ని జిల్లాలను తిరిగితే రాజకీయ స్వరూపమే మారిపోతుందంటున్నారు. అయితే పవన్ తన బస్సు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేయడానికి కారణాలున్నాయి. జగన్ ముందస్తు సంకేతాలతో అక్టోబరులో యాత్ర నిర్వహణకు ముందుకొచ్చారు. అయితే షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలియడంతో సంక్రాంతి తరువాతే శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. అప్పటికే ఎన్నికలకు ఏడాది ఉంటుంది. ఎన్నికల వాతావరణం ఉంటుంది. అటు తటస్థులతో పాటు అధికార, విపక్షాల నుంచి భారీ చేరికలు ఉండే అవకాశం ఉంది. వీటిన్నింటినీ పరిగణలోకి తీసుకునే పవన్ యాత్రను వాయిదా వేశారు. అయితే ఇన్నాళ్లూ ఒక ఎత్తు.. పవన్ బస్సు యాత్ర తరువాత మరో ఎత్తు అన్నట్టు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:Pawan Kalyan- Rajamouli: రాజమౌళి సినిమా ఆఫర్ ను పవన్ కళ్యాణ్ ఎందుకు వదులుకున్నాడంటే?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular