YCP- TRS: గత ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం నుంచి జగన్ కు సంపూర్ణ సహకారం లభించింది అన్నది బహిరంగ రహస్యమే. నిధుల సమీకరణ నుంచి పంపకాల వరకూ హైదరాబాద్ కేంద్రంగానే జరిగాయి. అటు కేసీఆర్ ఆకాంక్ష మేరకు ఏపీలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు దారుణ ఓటమి చవిచూశారు. దీంతో అటు కేసీఆర్ పంతం నెగ్గడంతో పాటు ఏపీలో తనకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడింది. అయితే కేసీఆర్ చేసిన సాయాన్ని జగన్ గుర్తు పెట్టకున్నారు. ఆయన పట్ల వినయ విధేయతలు చూపుతూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారన్న అపవాదును అయితే మూటగట్టుకున్నారు. కానీ విభజన సమస్యలను మాత్రం పరిష్కరించుకోలేకపోయారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు జగన్ సోదరి షర్మిళ సైతం తప్పుపట్టారు. అయితే విభజన సమస్యలపై కేంద్రం వద్ద పంచాయితీ పెట్టుకున్నా రాజకీయ ప్రయోజనాలు దృష్ట్యా వ్యక్తిగత స్నేహాన్ని మాత్రం జగన్, కేసీఆర్ కొనసాగిస్తూ వస్తున్నాయి.

అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ స్నేహాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్ బీజేపీ అగ్రనేతలతో సఖ్యతగా మెలుగుతున్నారు. అదే సమయంలో కేసీఆర్ తో కూడా సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. సహజంగానే ఆయన ఏపీ పై ఫోకస్ పెంచుతున్నారు. దీంతో ఇది జగన్ కు మింగుడుపడడం లేదు. అలాగని కేసీఆర్ ను వ్యతిరేకించనూ లేదు. పోనీ బీజేపీతో స్నేహం విడిచిపెడతామనుకుంటే సీబీఐ, ఈడీ కేసులు వెంటాడుతాయని భయం పట్టుకుంది. అయితే ప్రస్తుతానికైతే కేసీఆర్ కు దూరంగా ఉండడమే మంచిదన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లూ తమతో స్నేహ హస్తం కొనసాగించిన జగన్.. తీరా జాతీయ పార్టీ ప్రకటన సమయానికి సైలెంట్ అవ్వడం ఏమిటని కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
Also Read: Munugode By Election: మునుగోడు గత చరిత్ర ఇది.. ఇప్పుడు ఎవరికి జై కొడుతుందో?
అయితే తాము ఏ కూటమితో వెళ్లబోమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డితో జగన్ ప్రకటన ఇప్పించారు. ఇది టీఆర్ఎస్ నాయకులు ఎదురు దాడికి దిగారు. మంత్రి హరీష్ రావు జగన్ సర్కారు వైఫల్యాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై కూడా సజ్జలే కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబంలో విభేదాలున్నాయని.. దాని కారణంగానే హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టారంటూ సజ్జల ను ఓ రేంజ్ లో ఏసుకున్నారు. కానీ అటు తరువాత వైసీపీ నుంచి స్పందన లేకుండా పోయింది. అయితే దీనిపై వెనక్కి తగ్గమని అధిష్టానం నుంచి నాయకులకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. నిజంగా టీఆర్ఎస్ తో వైరం పెట్టుకుంటే జరిగే నష్టాలు తెలుసు కాబట్టే వివాదం ముదరకుండా ఫుల్ స్టాప్ పెట్టినట్టు సమాచారం. టీఆర్ఎం ఏమన్నా సరే రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతినే స్థాయిలో విమర్శలు చేయకూడదన్న కట్టుబాటుకు వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే టీఆర్ఎస్ తో శత్రుత్వం అంటే వైసీపీకి ఏం జరుగుతుందో తెలుసు. గతంలో శత్రుత్వం పెట్టుకున్న టీడీపీ మూల్యం చెల్లించుకుంది. అదే సమయంలో వైసీపీ ఎంతగా లాభపొందిందో ఆ పార్టీ నేతలకు తెలుసు. అందుకే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తో ఎట్టి పరిస్తితుల్లో వైరం పెట్టుకోకూడదని భావిస్తున్నారు. నాటి ఎన్నికల నుంచి నేడు టీడీపీ నేతలను టార్గెట్ చేసుకోవడం వరకూ కేసీఆర్ సర్కారు అన్ని వేళల సాయం చేస్తూ వచ్చింది. ఏపీ పోలీసులు తెలంగాణలో యథేచ్ఛగా వేటాడుతున్నారంటే కచ్చితంగా తెలంగాణ పోలీసులు… ప్రభుత్వం సహకారం లేనిదే అసాధ్యం. ఇలాంటి సహకారం మున్ముందు వైసీపీ సర్కారుకు చాలా అవసరం. అది కోల్పోవడానికి జగన్ సిద్ధంగా లేరు. అందుకే టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగినా పార్టీ శ్రేణులకు వెనక్కి తగ్గమనడానికి ప్రధాన కారణమని అదేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
Also Read:KCR Targets AP TDP: ఏపీలో టీడీపీని టార్గెట్ చేసిన కేసీఆర్.. కులం కార్డు వర్కవుట్ అవుతుందా?
[…] Also Read: YCP- TRS: టీఆర్ఎస్ ను తట్టుకోలేక చేతులెత్త… […]