Ileana: ఓ దశాబ్దం క్రితం ఇలియానా తెలుగు కుర్రాళ్ళ కలల రాణి. పోకిరి సినిమాతో ఆమె యువతకు నిద్రలేకుండా చేసింది. ఇలియానా బొంగరం లాంటి నడుము పెద్ద ఫాంటసీ. కలర్ తక్కువైనా పర్ఫెక్ట్ ఫిగర్ తో గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ గోవా బ్యూటీ దేవదాసు మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. దర్శకుడు వైవిఎస్ చౌదరి హీరో రామ్ కి జంటగా వెతికి మరీ ఈమెను తెచ్చాడు. ఆ మూవీ సూపర్ హిట్ కాగా… నెక్స్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దేవదాసు మూవీలో ఇలియానాను చూసిన దర్శకుడు పూరి కన్ను ఈమెపై పడింది.

దీంతో రెండో సినిమాకే మహేష్ వంటి టాప్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. అలాగే పోకిరి ఆమె ఇమేజ్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. స్టార్స్ వెంటపడేలా చేసింది. 2006లో విడుదలైన పోకిరి టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాసింది. ఇక వరుసగా ఎన్టీఆర్, రవితేజ, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ వంటి స్టార్స్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది. ఇలియానా నటించిన చిత్రాల్లో అధిక శాతం హిట్ అయ్యాయి.
Also Read: Koratala Siva- NTR: షాక్.. ఆ స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ ఆగిపోయింది?
అయితే ఇలియానా తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ ఆమె కెరీర్ ని దెబ్బేసింది. సౌత్ లో స్టార్ గా వెలిగిపోతున్న ఇలియానా బాలీవుడ్ లో పొడిచేయాలని చూసి బొక్క బోర్లా పడింది. కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న తీరు అయ్యింది. రన్బీర్ కపూర్ పక్కన ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేసింది. బాలీవుడ్ లో బర్ఫీ మూవీ చేసింది. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అదే సమయంలో టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించింది.

దీంతో మెల్లగా ఇక్కడి ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు. తీరా హిందీ పరిశ్రమలో ఇలియానా కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగలేదు. ఆమెకు చిన్న చిత్రాలలో మాత్రమే ఆఫర్స్ వచ్చాయి. బాలీవుడ్ లో బ్రేక్ రాలేదు. తిరిగి టాలీవుడ్ కి వద్దామనుకుంటే ఆఫర్స్ లేవు. ఏమి చేయాలో తెలియని పరిస్థితి చోటు చేసుకుంది. తెలుగులో ఇలియానా నటించిన చివరి చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. ఇది అట్టర్ ప్లాప్ కావడంతో తెలుగులో పూర్తిగా దారులు మూసుకుపోయాయి.
కొన్నాళ్ళు ఆస్ట్రేలియా లవర్ తో ఇలియానా చెట్టపట్టాలేసుకుని తిరిగింది. పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే అతడు హ్యాండ్ ఇచ్చాడు. కొన్నాళ్లు లవ్ బ్రేకప్ డిప్రెషన్ లో ఉంది ఇలియానా. ఆ టైం లో బరువు కూడా పెరిగింది. హీరోయిన్ గా కెరీర్ ముగింపు దశకు రాగా సోషల్ మీడియాలో షాక్ ఇస్తుంది. తాజాగా ఎల్లో కలర్ టూ పీస్ బికినీ ధరించిన ఇలియానా బోల్డ్ ఫోజుల్లో టెంపరేచర్ పెంచేశారు. ఆమె హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read:Saidharam Tej : ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిపిన మెగా హీరో సాయి ధరమ్… అనూహ్యంగా బ్రేకప్ అదో పెద్ద మిస్టరీ!
[…] Also Read: Ileana: మై గాడ్… దాచడానికి ఇంకేముంది, పీలి… […]