https://oktelugu.com/

Pawan Kalyan-TDP: ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్… టీడీపీ మాస్టర్ ప్లాన్ ఇదే!

Pawan Kalyan-TDP: ఏపీ రాజకీయాల్లో వైసీపీని లేకుండా చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఒకసారి తమ ఉమ్మడి సీఎం క్యాండిడేట్ గా కూడా ప్రకటించబడ్డాడు. కానీ తర్వాత బీజేపీ పెద్దలు మాట మార్చేశారు. దీంతో బీజేపీకి కాస్త దూరంగానే పవన్ ఉంటున్నారు. ఒంటరిగా రాజకీయం చేస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీతో పొత్తుకు పవన్ అనుకూలంగా ఉన్నట్టు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2022 / 05:45 PM IST
    Follow us on

    Pawan Kalyan-TDP: ఏపీ రాజకీయాల్లో వైసీపీని లేకుండా చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఒకసారి తమ ఉమ్మడి సీఎం క్యాండిడేట్ గా కూడా ప్రకటించబడ్డాడు. కానీ తర్వాత బీజేపీ పెద్దలు మాట మార్చేశారు. దీంతో బీజేపీకి కాస్త దూరంగానే పవన్ ఉంటున్నారు. ఒంటరిగా రాజకీయం చేస్తున్నారు.

    Pawan Kalyan- Chandrababu

    వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీతో పొత్తుకు పవన్ అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీతో పొత్తుకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ను ప్రకటిస్తేనే పొత్తుకు ఓకే చెబుతాడని అంటున్నారు. చంద్రబాబు ఇప్పటికే మూడు సార్లు సీఎం అయ్యారు. వయసు అయిపోయింది. జగన్ ను ఓడించడం చంద్రబాబు వల్ల కాదంటున్నారు. అందుకే యువకుడు, ఉత్సాహవంతుడైన పవన్ కళ్యాణ్ ను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించి ఎన్నికల్లో ముందుకెళ్లాలని జనసైనికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

    ఇక 2024 ఎన్నికలకు ముందు ఖచ్చితంగా టీడీపీ, జనసేన కలవడం గ్యారెంటీ అంటున్నారు. చంద్రబాబు తప్పనిసరిగా పవన్ తో పొత్తు పెట్టుకుంటాడని.. ఆయనకు ఆప్షన్ లేదంటున్నారు. అయితే పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి.. తాను సీఎంగా ఎన్నికలకు వెళదామని కోరుతారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.కానీ సీఎం అభ్యర్థిగా తనకే ఇవ్వాలని పవన్ మొండి పట్టుదట పడుతున్నాడట.. డిప్యూటీ సీఎంకు కానీ.. మంత్రి పదవికి కానీ పవన్ అస్సలు ఒప్పుకోవడం లేదట.

    Pawan Kalyan, Chandrababu

    టీడీపీ మాత్రం పవన్ కు డిప్యూటీ సీఎం ఆఫర్ చేసి జగన్ ను ఓడించి జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాస్టర్ ప్లాన్ చేస్తోంది. మరి దీనికి పవన్ అంగీకరిస్తారా? డిప్యూటీసీఎం పోస్టు తీసుకుంటాడా? అన్నది భవిష్యత్తులోనే తలేలనుంది.

    Tags